Newsలాస్యకు కాబోయే భర్త ఇతడే.. ఫోటోస్ పబ్లిక్‌గా విడుదల చేసిన యాంకరమ్మ

లాస్యకు కాబోయే భర్త ఇతడే.. ఫోటోస్ పబ్లిక్‌గా విడుదల చేసిన యాంకరమ్మ

Finally, anchor Lasya released the photos of bridegroom with whom she got engaged. But she didn’t reveal the marriage date yet.

యాంకర్ లాస్య.. గతేడాది నుంచి కనిపించకుండా పోయింది ఈ అమ్మడు. ఉన్నట్లుండి ఎక్కడ మాయమైంది? ఏమైనా అనారోగ్యమా? కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా డ్రాప్ ఎందుకైంది? .. అంటూ రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. ఆమధ్య చనిపోయినట్లు పుకార్లు కూడా జోరుగా చక్కర్లు కొట్టాయిలెండి. అప్పుడొక్కడే ఈ భామ తళుక్కుమంది. తాను బాగానే ఉన్నానని, త్వరలోనే మళ్ళీ వస్తానంటూ ఓ వీడియో పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు అదృశ్యమైన లాస్య.. ‘రాజా మీరు కేక’ అనే సినిమా చేస్తున్నానంటూ వార్తల్లోకెక్కింది. ఆ మూవీ ఫోటోలు కూడా రిలీజయ్యాయి. ఇప్పుడు హఠాత్తుగా ఈ యాంకరమ్మ తన ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యే వార్తతో ముందుకొచ్చింది. ఏకంగా తన నిశ్చితార్థం అయ్యిందని ఓ మెసేజ్ రాత్రికి రాత్రి పెట్టి.. ఆ మరుసటి రోజే ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది.

తొలుత తనకు నిశ్చితార్థం అయినట్లుగా ఉంగరాల ఫోటో పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత పెళ్ళికూతురు గెటప్‌లో ఉన్న ఫోటో పెట్టింది. వరుడు ఎవరన్న విషయాన్ని రివీల్ చేయకుండా.. సస్పెన్స్‌గానే పెట్టింది. ఈ నేపథ్యంలోనే.. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ఈమె ఎంగేజ్‌మెంట్ అయి వుంటుందని మళ్ళీ ప్రచారాలు మొదలయ్యాయి. బహుశా వీటికి బ్రేక్ వేసేందుకో లేక మరో కారణమో తెలీదు కానీ.. అమ్మడు నిశ్చితార్థం చేసుకున్న సాయంత్రమే తనకు కాబోయే భర్త ఫోటోల్ని విడుదల చేసింది. అతని పేరు మంజునాథ్ అని రివీల్ చేసిన లాస్య.. అతడొక మరాఠీ అబ్బాయి అని కూడా తెలిపింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

విశేషం ఏమిటంటే.. తనకు విష్ చేస్తున్న ప్రతి అభిమానికి అమ్మడు ఫేస్‌బుక్‌లో రిప్లై ఇస్తోంది. ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ కామెంట్ కూడా చేసింది. అంతేకాదు.. ‘పెళ్లయ్యాక యాంకరింగ్ కంటిన్యూ చేస్తారా?’ అని ఓ అభిమాని ప్రశ్నకి అవునని సమాధానం సైతం ఇచ్చింది లాస్య. అయితే.. పెళ్లి ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. బహుశా.. ఆ ఈవెంట్‌ని కూడా వెల్లడించకుండా సడెన్‌గా పెళ్ళి చేసుకుని, దర్శనమిస్తుందేమో!

Latest news