ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’

allu arjun doing ntr chary character in dj movie

Stylish star Allu Arjun portraying NTR’s Brahmin chary character in his latest movie DJ- Duvvada Jagannadham which is directed by Harish Shankar.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఓ కోరిక బలంగా కోరుకుంటూ వస్తున్నారు. ఏదో ఒకరోజు తమ కోరికని తారక్ ఖచ్చితంగా నెరవేరుస్తాడని వాళ్లు భావిస్తూ వస్తున్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే అది ఎప్పటికీ కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. అందుకు కారణం.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేస్తున్న తాజా సినిమానే.

మేటర్‌లోకి వెళ్తే.. గతంలో వివి వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అదుర్స్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. అంతేకాదు.. తారక్‌లో దాగివున్న మరో కోణం అదే కామెడీ యాంగిల్‌ని బయటపెట్టింది కూడా ఈ చిత్రమే. బ్రాహ్మణుడి పాత్రలో తారక్ ఒదిగిపోయిన తీరు, నవ్వులు పండించిన విధానానికి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. అప్పటినుంచి వారి కాంబోలోనే‘అదుర్స్-2’ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ.. వీరి ఆశలపై బన్నీ నీళ్లు జల్లేశాడు. ఎన్టీఆర్ పోషించిన ఆ చారి పాత్రని ఈ స్టైలిష్ స్టార్ తన తాజా చిత్రంలో పోషిస్తున్నాడు. అవును.. మీరు చదువుతోంది వాస్తవం.

బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే – దువ్వాడ జగన్నాధం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే బన్నీ ఆ చారి పాత్రని పోషిస్తున్నాడు. నిజానికి.. అప్పట్లో ఈ బ్రాహ్మణుడి పాత్రని సృష్టించింది ఎవరో కాదు.. వినాయక్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన హరీష్ శంకర్. ఈ లెక్కన.. ఈ పాత్రపై ఉన్న అధికారాలు మొత్తం అతనికే చల్లుతాయి. అందుకే.. అదే చారి ఛాయలు ఉన్న పాత్రను లీడ్ రోల్‌గా చేసి, డీజేని తెరకెక్కిస్తున్నాడని బలమైన టాక్ వినిపిస్తోంది. ఇది ‘అదుర్స్’కి సీక్వెల్ కాదు కానీ.. బన్నీ చేస్తున్న పాత్ర మాత్రం ఎన్టీఆర్ చేసిన చారి టైపులోనే ఉంటుందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది తారక్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి!

Leave a comment