రెండో వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాలు ఇవే.. ‘ఖైదీ’ స్థానం ఎంతో తెలుసా?

all time top 5 second week share telugu movies

All time top 5 second week share telugu movies list is here.

భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాలు తొలిరోజు, ఫస్ట్ వీకెండ్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి. టాక్ ఏదొచ్చినా సరే.. రిలీజ్‌కి ముందు వాటిపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ వరకు జనాలు థియటర్లపై ఎగబడతారు. దాంతో.. అవి రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేస్తాయి. కానీ.. కొన్ని సినిమాలు మాత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటాయి. ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న మూవీలు అప్పటికే చాపచుట్టేస్తే.. హిట్ టాక్ వచ్చిన సినిమాలు ఫర్వాలేదనిపించే స్థాయిలో కలెక్ట్ చేస్తాయి. కానీ.. కొన్ని సినిమాలు మాత్రం అంచనాలకు మించే ఎక్కువ వసూళ్లు కలెక్ట్ చేస్తాయి. రెండో వారంలోనూ తమ సత్తా చాటుకుంటాయి.

అలాంటి చిత్రాల్లో ‘బాహుబలి’ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంటా టాలీవుడ్ ఖ్యాతిని చాటిచెప్పిన ఈ చిత్రం.. రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని అక్షరాల రూ.25.75 కోట్లు సాధించింది. ఇంతవరకు ఏ ఒక్క తెలుగు సినిమా రెండో వారంలో ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించలేదు. ఇక దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ రూ.13.67 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిత్రాల అనంతరం ‘సరైనోడు’ (రూ.13.54 కోట్లు), ‘శ్రీమంతుడు’ (రూ.11.45 కోట్లు), ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (రూ.10.38 కోట్లు) సినిమాలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు చిత్రాలు ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అవ్వడం వల్లే ఇలా వసూళ్లు రాబట్టి.. రెండో వారంలో అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన టాప్-5 సినిమాలుగా నిలిచాయి.

రెండో వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాల వివరాలు (కోట్లలో) :
1. బాహుబలి : 25.75
2. ఖైదీ నెం.150 : 13.67
3. సరైనోడు : 13.54
4. శ్రీమంతుడు : 11.45
5. సోగ్గాడే చిన్ని నాయనా : 10.38

Leave a comment