అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు వార్నింగ్ ఇచ్చిన నాగ్..?

akkineni-nagarajuna-gave-warning-to-samantha

Recently Akkineni Nagarjuna gave warning to samantha infront of media members and share his opinion about samantha calls him as…

అక్కినేని వారింట త్వరలో పెళ్లి సందడి మొదలవబోతుంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య తాను ప్రేమించిన సమంతతో పెళ్ళికి ఓకే చెప్పగా,చిన్న కొడుకు అఖిల్ జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.కాగా వీరి పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా చేయుటకు రోమ్ లో ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించారు. ముఖ్య అతిధిలుగా 150 మంది మాత్రమే హాజరు కానున్నారని సమాచారం, రిసెప్షన్ వేడుకను మాత్రం హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నట్టు నాగార్జున వెల్లడించారు.

అదే సందర్భంలో నాగార్జున ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.. “నన్ను మామయ్య అని పిలవడానికి నా కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో. అఖిల్ కు కాబోయే భార్య శ్రియ భూపాల్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. నన్ను ఆమె నాగ్ మామా అని పిలుస్తుంది. సమంతకే ఈ విషయంలో కొంచెం సమస్య, నన్ను ఎలా పిలుస్తావ్.. అని సామ్ ను అప్పుడప్పుడూ అడుగుతుంటా. తనేమో నవ్వేసి ఊరుకుంటుంది. తనను మామూలుగా నాగ్ సార్ అని సమంత పిలుస్తుందని.. ఐతే ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు వార్నింగ్ ఇచ్చినట్లు నాగ్ తెలిపాడు”. ఐతే సమంత తనను ఎలా పిలుస్తుందో ఎదురుచూస్తున్నాను అని నవ్వుకున్నాడు నాగార్జున.

అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టబోతున్న సమంత తెలుగులో సినిమాలు చెయ్యడానికి సుముకంగా లేదా..అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లే హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయడానికి స్టార్‌ హీరోలు ఆసక్తి చూపడంలేదా అనే విషయంపై సందేహం నెలకొంది. తెలుగులో ప్రత్యేక పాత్రల్లో మాత్రమే చేస్తానంటున్న సమంత తమిళంలో వచ్చే ఆఫర్లను మాత్రం వదలడంలేదు.