Newsరైలులో అమ్మాయితో శృంగారం చేస్తూ.. అడ్డంగా బుక్కైన టికెట్ కలెక్టర్

రైలులో అమ్మాయితో శృంగారం చేస్తూ.. అడ్డంగా బుక్కైన టికెట్ కలెక్టర్

ticket collector Satyababu caught redhanded having sex with a girl in kanyakumari mumbai express train. Few passengers took video footage and photos, gave complaint against him.

కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు రానురాను మితిమీరిపోతున్నారు. నాలుగుగోడల మధ్య సాగించాల్సిన శృంగార కార్యకలాపాల్ని సిగ్గులేకుండా పబ్లిక్ స్థలాల్లో కానిచ్చేస్తున్నారు. నలుగురూ చూస్తారన్న కనీసం ఇంగితజ్ఞానం లేకుండా.. శృంగారలోకంలో మునిగితేలుతున్నారు. ఇలాగే ఓ జంట ట్రైన్‌లో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోగా.. అందులో ఉన్న ప్యాసెంజర్లు వారిని చీవాట్లు పెట్టారు. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. డ్యూటీలో ఉన్న టీటీఈనే ఓ అమ్మాయితో రాసలీలలు కొనసాగిస్తూ బుక్కయ్యాడు. ప్రయాణికులు నిలదీయడంతో ఆ టీటీఈ మధ్యలోనే దిగి పారిపోగా.. అతడిపై కొందరు రైల్వే బోర్డుకి పిర్యాదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైల్వే టీటీఈ అయిన సత్యబాబు రేణిగుంటలో కన్యాకుమారి-ముంబాయి ఎక్స్ ప్రెస్‌లో విధులకు హాజరయ్యాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతగాడు.. తనతోపాటు ఓ మహిళను కూడా తెచ్చుకున్నాడు. తెల్లవారు జామున ప్రయాణికులందరూ నిద్రమత్తులోకి జారుకున్నాక.. ఓ కోచ్‌లోని ఒక ఖాళీ బెర్తులో స‌త్య‌బాబు ఆ మ‌హిళ‌తో రాస‌లీల‌లు సాగిస్తున్నాడు. ఇంతలో మెళుకువ వచ్చిన కొందరు ప్రయాణికులు వారి రాసలీలలు చూసి ఖంగుతిన్నారు. వెంటనే ఆ దృశ్యాల్సి తమ కెమెరాలో వీడియో తీశారు. ఇంకొందరు ఫోటోలు తీసి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు జనాలు గుమికూడి.. సత్యబాబుని ప్రశ్నించారు. వారితో అతడు వాగ్వాదానికి దిగగా.. ఇంతలోనే ఓ స్టేషన్ రావడంతో ఆ మహిళ ట్రైన్ దిగి పారిపోయింది. తర్వాత స్టేషన్ వద్ద సత్యబాబు పారిపోయాడు.

ప్రయాణికులు తమ వద్ద ఉన్న వీడియో క్లిప్పింగ్స్, ఫొటోలను రైల్వేబోర్డు, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు వాట్సాప్, మెయిల్ లో పంపి ఫిర్యాదు చేశారు. అలాగే.. రైలు గుంతకల్లుకు చేరుకోగానే అక్కడి రైల్వే జిఆర్‌పి, ఆర్పీఎఫ్ పోలీసులకు కూడా ప్రయాణికులు అతగాడిపై ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news