నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాటల మాంత్రికుడు చెప్పే ‘తారక మంత్రం’

trivikram srinivas finalised as director for ntr 28 movie

Good news for NTR fans. Finally Trivikram Srinivas and Tarak combinational has finalised and this project will start from next year. According to the latest report Trivikram locked the script and he impressed Tarak which he listened recently.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో పక్కా క్లారిటీ లేదు కానీ.. నందమూరి ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్తొకటి వెలుగులోకి వచ్చింది. తన 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తారక్ చేయనున్నాడని ఫిక్స్ అయ్యింది. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఏ కాంబినేషన్ కోసమైతే ఫ్యాన్స్ వెయ్యికళ్లతో వేచి చూస్తున్నారో.. చివరికి ఆ కాంబో సెట్ కాబోతోంది. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇప్పటికే తారక్‌ని త్రివిక్రమ్ కలవడం, తన దగ్గరున్న ఓ స్ర్కిప్ట్‌ని వినిపించడం, అది తనకు నచ్చి ఓకే కూడా చెప్పేయడం జరిగిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్ర్కిప్ట్‌ని పూర్తిగా డెవలప్ చేసే పనిలో బిజీ అయిపోయాడు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది జూన్‌ లేదా జూలైలో సెట్స్ మీదకి వెళ్ళనుందని తెలిసింది. ఓవైపు పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తూనే.. మరోవైపు తారక్ మూవీని రూపొందించే మాస్టర్ ప్లాన్ త్రివిక్రమ్ వేసుకున్నాడు. ఈ చిత్రాన్ని 2018లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి.. వీరి కాంబోలో ఓ మూవీ ఎప్పుడో తెరకెక్కాల్సింది. కానీ.. ఇరువురు తమతమ ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. చివరికి.. కలుసుకోవడానికి కూడా తీరిక సమయం లేకపోవడంతో.. వారి కాంబో సెట్ కాలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకి డేట్స్ దొరకడంతో.. ఇద్దరూ కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారు.

Leave a comment