Movies శ్రీనువైట్ల - వరుణ్ తేజ్‌ల ‘మిస్టర్’ మూవీ టీజర్ రివ్యూ

శ్రీనువైట్ల – వరుణ్ తేజ్‌ల ‘మిస్టర్’ మూవీ టీజర్ రివ్యూ

Srinu Vaitla and Varun Tej’s combo latest film Mister posters and teaser released on New Year vacation. In this teaser varun looked very class never before and director changed his making style after consecutive flops.

వరుస పరాజయాల తర్వాత కొన్నాళ్లు కనిపించకుండా పోయిన దర్శకుడు శ్రీనువైట్ల.. ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి మెగాహీరో వరుణ్ తేజ్‌తో ఓ మూవీ ఓకే చేయించుకున్నాడు. తొలుత ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళడానికి అడ్డంకులు ఎదురైనప్పటికీ.. వాటినుంచి గట్టెక్కి చివరికి షూటింగ్ ప్రారంభించాడు. ఫారిన్‌లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి న్యూఇయర్ కానుకగా ఓ టీజర్‌ని మధ్యాహ్నం 3:30 గంటలకు యూనిట్ రిలీజ్ చేసింది. అంతకుముందు 3 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్స్, టీజర్‌లో వరుణ్ తేజ్ చాలా హ్యాండ్‌సమ్‌గా, కొత్త గెటప్‌లో కనువిందు చేశాడు. టీజర్‌లో స్టోరీలైన్‌ని రివీల్ చేయలేదు కానీ.. చాలా స్టైలిష్‌గా చూపించారు. ముఖ్యంగా.. ఫారిన్ అందాల్ని కెమెరాలో బంధించిన విధానానికి ఎవ్వరైనా మెస్మరైజ్ అయిపోతారు. చూస్తుంటే.. ఇందులో మాస్ టచ్ ఏమీలేకుండా శ్రీనువైట్ల పూర్తిగా క్లాస్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌కి మ్యూజిక్‌గా కూడా సింపుల్‌గా అదిరింది. శ్రీనువైట్ల మేకింగ్ పరంగా కాస్త డిఫరెంట్ స్టైల్‌ని ఎంచుకున్నాడు. తన పాత స్టైల్‌కి మైనస్ మార్కులు ఎక్కువ పడడంతో.. ఈసారి కొత్త రూట్‌ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్లు హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు ఇందులో చాలా అందంగా కనిపించారు. ఈ ఇద్దరితో హీరో నడిపే ప్రేమాయణం చూస్తుంటే.. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది. ఒకటి ఫారిన్‌లో, మరొకటి లోకల్‌లో. ఈ రెండు ప్రేమకథల్లో ఏది గెలుస్తుందో.. సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news