‘రయీస్’ ట్రైలర్ టాక్ : మాస్ మసాలాతో ఇరగదీసిన బాద్‌షా

shahrukh khan raees movie trailer talk nawazuddin siddique mahira khan

Finally, India’s most waited ‘Raees’ trailer has released on 7th December. In this trailer the Chemistry between SRK and Nawazuddin appears to be the key highlight for Raees.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రయీస్’ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వేచి చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. రీసెంట్‌గా ప్రకటించినట్లుగానే షారుఖ్ ఈ ట్రైలర్‌ని ఈరోజు (07-12-2016) రిలీజ్ చేశాడు. అదిగో, ఇదిగో నాన్చుతూ చివరికి విడుదలైన ఈ ట్రైలర్ ఎలాగుందో చూద్దాం పడండి..

టీజర్‌లో వినిపించే డైలాగ్‌తోనే ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ మాస్ మసాలా కమర్షియల్‌తో నిండి ఉంది. తాను చేస్తున్న బిజనెస్ కరెక్టా, కాదా? అని ఆలోచించే షారుఖ్ (రయీస్) మద్యం వ్యాపారం చేస్తుంటాడు. ఈ బిజినెస్ క్రైమ్ కాబట్టి.. దీన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఎందరో ప్రయత్నాలు విఫలం కావడంతో నవాజుద్దీన్ సిద్దిఖీ రంగంలోకి దిగుతాడు. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య దొంగా-పోలీస్ ఆట సాగుతుందని, కథే ఇదేనని ట్రైలర్ మొత్తంలోనే చూపించారు. ఎప్పటిలాగే నవాజుద్దీన్ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటే.. షారుఖ్ తన చరిష్మాతో కట్టిపడేశారు. లుక్ పరంగా కేక అనిపించిన షారుఖ్.. రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఇక అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్‌లో కనిపించిన పాకిస్తాన్ నటి క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది.

రాహుల్ ఢోలకియా, హరిత్ మెహతా సంయుక్తంగా రాసిన డైలాగులు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కళ్ళుచెదిరేలా ఉన్నాయి. విశేషం ఏంటంటే.. 50 ఏళ్ల పైబడిన షారుఖ్ ఆ యాక్షన్ సీక్వెన్స్‌లను డూప్స్ లేకుండా చేశాడు. గుజరాతీ ఫ్లేవర్ ఎక్కువగా నిండిన ఈ ట్రైలర్‌లో మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ తళుక్కుమంది. ఆమె కనిపించినప్పటి నుంచి ‘లైలా ఓ లైలా’ అనే ఐటెం సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. అన్ని ఎలిమెంట్స్‌తో మిక్స్ అయిన ఈ ట్రైలర్ అంచనాలను రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యింది. ఇక 25వ తేదీన ఈ ‘రయీస్’ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

Leave a comment