పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన సత్యానంద్.. వింటే మీరూ షాక్ అవుతారు!

satyanand reveals real life story of pawan kalyan before become hero

Satyanand who is a trainer of all superstars in Tollywood has revealed that the real life story of Pawan Kalyan before becomes a hero. He told about him that he is very shy everytime and don’t like to mingle with everyone.

పవన్ కళ్యాణ్.. సినిమాల్లో ‘పవర్‌స్టార్’గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఈయన వ్యక్తిగతంగానూ ఎంతోమంది ఆదరాభిమానులు పొందుతున్నాడు. సహనం, మానవత్వం, సూటిగా మాట్లాడే స్వభావం, నలుగురిపట్ల చూపించే గౌరవం, ఆపదలో ఉన్నవారిని తన ఆర్థిక స్థితిని మరిచిపోయి మరీ వెంటనే ఆదుకోవడం, తన గురించి గొప్పగా కాకుండా నేనూ సాధారణ మనిషినేనని చెప్పుకునే మంచితనం.. ఇలా ఎన్నో గుణాలు ఆయన్ను మనలో ఒకడ్ని చేశాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఇండస్ట్రీలోకి రాకముందు పవన్ ఎలా ఉండేవాడు? ఇండస్ట్రీవైపు తన తొలి అడుగులు ఎలా పడ్డాయి? కెమెరాముందు ఇంతా హుందాగా కనిపించే పవన్.. దాని వెనకాల ఎలా ప్రవర్తిస్తాడు? అన్న ప్రశ్నలు నిత్యం ఆలోచింపచేస్తాయి. ఇకపై అలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పవన్ గురువు సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతని గతంతోపాటు నిజస్వరూపాన్ని కూడా బయటపెట్టేశాడు.

పవన్ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఆయన వ్యవహారశైలి చాలా విచిత్రంగా వుండేదట. అతను ప్రవర్తించే తీరును చూసి, అసలు ఇతను హీరో అవ్వగలడా? అనే అనుమానం స్వయంగా కుటుంబసభ్యులే వెల్లడించేవారట. సిగ్గుతో ఎప్పుడు తల వంచుకుని వుండడం, నలుగురిలో కలవకుండా సింగిల్‌గా తన పనితాను చేసుకుపోవడం, ఫ్యామిలీ మెంబర్స్‌తోనే కళ్ళలో కళ్లు పెట్టి చూడకపోవడం, అసలు ఎవరితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా పవన్ వ్యవహరించేవాడట. తన తమ్ముడు ఇలా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన చిరంజీవి.. పవన్ కోరిక మేరకు అతన్ని తన వద్దకు యాక్టింగ్ నేర్పించడం కోసం పంపారని సత్యానంద్ చెప్పారు. ఈ సమయంలోనే తనకు, చిరు మధ్య సంబంధం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని బహిర్గతం చేశారు. ‘మంచుపల్లకి’ సినిమా చేసే సమయంలో తాను క్యాస్టింగ్ డైరెక్టర్‌గా ఉండగా.. అప్పుడే చిరు తనకు పరిచయం అయ్యారని అన్నారు. అప్పట్లో తన పనితనం చూసి మెచ్చుకున్న చిరు.. ఆ మూవీ చేసిన తొమ్మిదేళ్ల తర్వాత తనపై ఉన్న నమ్మకంతో పవన్‌ని అప్పగించారని సత్యానంద్ అన్నారు.

అలా తన దగ్గరికి వచ్చిన కొత్తలో చాలా వింతగా ప్రవర్తించేవాడని తెలిపారు. యాక్టింగ్ నేర్పించే సమయంలో ఎవరైనా కొత్తవాళ్లు వస్తే.. ‘వాళ్లెవరు? ఇక్కడేం పని? వాళ్ళని వెంటనే బయటికి పంపించేయండి?’ అంటూ పవన్ చెప్పేవాడట. అప్పుడు తాను.. ‘సినిమాల్లో నటిస్తున్నప్పుడు నీ చుట్టూ కొన్ని వేలమంది వుంటారు.. వారి మధ్యలోనే నువ్వు నటించాల్సి వస్తుంది.. అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తే పైకి ఎదగలేవు..’ అంటూ ప్రతిరోజూ బోధిస్తూ రావడంతో అతనిలో మార్పు వచ్చిందని ఆయన వెల్లడించారు.

Leave a comment