పేద మహిళకు సాయం చేసి చేయూత అందించిన సంపూర్ణేష్ బాబు

sampoornesh babu helps old woman in siddhipeta

Telugu actor Sampoornesh babu helps a poor woman who is suffering from heavy fever. He gave 10,000 for her treatment.

‘హృదయ కాలేయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు.. పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సంపూ. ఇటీవలే టీవీలో ఓ మహిళ గురించిన సమస్యను తెలుసుకొని స్పందించి తన వంతు సాయం అందించారు.

వివరాల్లోకి వెళితే… సిద్ధిపేట మండలం గాడిచర్ల పల్లి గ్రామంలో ఒక పేద మహిళ వింత వ్యాధితో.. తోడు ఎవరూ లేక బాధపడుతోంది. ఆమె గురించి టీవీలో వచ్చిన వార్తను చూసి సంపూర్ణేష్ బాబు స్పందించి 10,000 రూపాయల చెక్ అందించారు. స్వయంగా ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని.. సాయం అందించారు. ఆమె ఆర్థికంగా, మానసికంగా దీన స్థితిలో ఉండడంతో.. తన వంతుగా స్పందించానని.. నాతో పాటు.. మరికొంతమంది కూడా స్పందిస్తే ఆ మహిళకు చేయూత అందించిన వారవుతారని సంపూర్ణేష్ బాబు ఈ సందర్భంగా కోరారు.

Leave a comment