ఎన్టీఆర్ కాకినాడ టూర్ వెనుక అసలు కారణం ఇదే!

reason behind ntr family kakinada tour

Young tiger NTR visits Kakinada along with his family members, Everyone thought why ntr went to Kakinada suddenly. Finally the real reason is out. Read below article to know about that.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడనుకుంటున్న తరుణంలో.. సడెన్‌గా రాజమండ్రి విమానాశ్రయంలో తన కుటుంబసభ్యులతో కలిసి దర్శనమిచ్చాడు. అక్కడి నుంచి నేరుగా కాకినాడకు పయనమయ్యాడు. చాలాకాలం తర్వాత తారక్ ఇలా బయటకు రావడంతో.. అభిమానులు ఒక్కసాడిగా సందడి చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. తారక్ ఉన్నట్లుండి కాకినాడకు ఎందుకు వెళ్ళాడు? అనే విషయమై ఇండస్ట్రీలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కీ ఇదే సందేహం కలిగింది. అసలు విషయం ఏమై ఉంటుందా? అని అనుకుంటుండగా.. అదేంటో బయటపడింది.

గతంలో హరికృష్ణ కుమారుడు.. తారక్, కళ్యాణ్‌రామ్‌ల సోదరుడు అయిన జానకిరామ్ యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడైన మాస్టర్ ఎన్టీఆర్‌కు పంచెకట్టు ఫంక్షన్ కాకినాడలో జరిగింది. ఈ ధోతీ ఈవెంట్‌కే తారక్ తన కుటుంబంతోపాటు వెళ్ళాడు. ఈ ఫంక్షన్‌కి కళ్యాణ్ రామ్, హరికృష్ణలు కూడా హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్‌ని ఫ్యామిలీ మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంది. ఇది.. తారక్ కాకినాడకు వెళ్ళడానికి అసలు కారణం. కాగా.. ఎన్టీఆర్ 27వ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలిసింది.

Leave a comment