జీవితంలో ఇటువంటివారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు..

Ram Charitamanas Explains The Truth Of Normal People Who Cant Become Rich

Ram Charitamanas Explains The Truth Of Normal People Who Cant Become Rich in whole life because of their behaviours. Read full story to know more details.

తులసీదాస్ రాసిన ‘రామచరిత మానస్’ పద్యకావ్యం రాముడు, రామాయణం గురించే కాదు.. సామాన్య ప్రజానీకానిక చెందిన జీవిత సత్యాలు ఉన్నాయి. లక్ష్మణుని పాత్ర ద్వారా సామాన్యుడి లక్షణాలు, వారి జీవన విధానం గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాటిలో కొందరు ఎప్పటికీ ధనవంతులు కాలేరని, పేదవారిగానే ఉండిపోతారని వెల్లడించడమైనది. ఆ కొందరు ఎవరో.. క్రింద చదివి మీరే తెలుసుకోండి..

1. మద్యం, మత్తుపదార్థారాలకు, దురలవాట్లకు బానిసలైన వ్యక్తులు సంపాదించిని మొత్తం వాటికే ఖర్చుపెడతారు కాబట్టి.. వాళ్లు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు.
2. తమ జీవిత భాగస్వాములను మోసం చేసేవారు వారు ఇలాంటి జాబితాకే చెందినవారే. ఎందుకంటే.. వీళ్లు తమ సంపాదన మొత్తం ప్రేమికులకే ఖర్చు చేస్తారు.
3. అత్యాశపరులు కూడా జీవితంలో ధనవంతులు కాలేరు. ఎక్కువ పొందాలని ఉన్నది పోగొట్టుకుంటారు. అలాగే.. వీరు ఏదీ పొందలేరు. వీరికి ఆత్మ గౌరవం కూడా ఉండదు.
4. దురహంకారులు.. ఇలాంటి వ్యక్తులు మొరటుగా ఉండడంతోపాటు ఇతరుల కీడు కోరుకుంటారు. వీరి గర్వమే వీరి పాలిట శత్రువుగా మారుతుంది.
5. సోమరిపోతులు.. వీళ్లు జీవితంలో డబ్బు కూడబెట్టుకోలేరు సరికదా సంతోషంగా కూడా ఉండరు. ఇతరులపై ఆధారపడి బ్రతుకుతారు తప్ప.. ఎప్పటికీ ఎదగలేరు.

Leave a comment