Movies‘ధృవ’ రెండువారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఆ రికార్డ్ సాధించిన తొలి సినిమా...

‘ధృవ’ రెండువారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఆ రికార్డ్ సాధించిన తొలి సినిమా ఇదే!

Ram Charan’s latest film Dhruva 2 weeks worldwide collections are out. This film stood as the first 50 crores in Indian film history after demonetization.

ఏ అంచనాలతో అయితే ‘ధృవ’ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. పడిలేచిన కెరటంలా రెండు వరుస పరాజయాలు చవిచూశాక ‘ధృవ’తో రామ్ చరణ్ ఘనవిజయం సాధించాడు. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ని ధీటుగా ఎదుర్కొని.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. రెండు వారాల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. దీంతో.. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆ ఫీట్ సాధించిన తొలి చిత్రంగా ‘ధృవ’ తన ఖాతాలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. తెలుగు సినిమాలకు అచ్చిరాదనే ‘డిసెంబర్’ సెంటిమెంట్‌ని తొక్కిపడేసి, 84 ఏళ్ల టాలీవుడ్ చరిత్రని ఈ మూవీ తిరగరాసింది.

అలాగే.. కెరీర్ ప్రారంభం నుంచి చరణ్ డ్రీమ్ మిలియన్ మార్క్‌నీ ఈ చిత్రం క్రాస్ చేసింది. ఇప్పటికే.. నైజాంలో లాభాల పంట పండించిన ‘ధృవ’, చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కి కూడా చేరుకుంది. సీడెడ్, నెల్లూరు ఏరియాల్లో వెనుకబడ్డ.. మిగిలిన అన్నీ ఏరియాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అటు కర్ణాటకలోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. ఇలా అన్ని ఏరియాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ.50.58 కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. ఏరియాలవారీగా ఈ మూవీ కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 13.31
సీడెడ్ : 5.98
ఉత్తరాంధ్ర : 4.68
ఈస్ట్ గోదావరి : 2.77
వెస్ట్ గోదావరి : 2.46
కృష్ణా : 2.60
గుంటూరు : 3.08
నెల్లూరు : 1.19
ఏపీ+తెలంగాణ : రూ. 36.07 కోట్లు (షేర్)
కర్ణాటక : 6.41
రెస్టాఫ్ ఇండియా : 1.5
ఓవర్సీస్ : 6.6
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 50.58 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news