పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ పెదనాన్న..?

pawan kalyan trivikram combo movie mohanlal keyrole

Malayalam super star Mohanlal will play a key role in Pawan Kalyan and Trivikram’s combo Film. Mohanlal already done Manamantha, Janatha Garage movies in telugu with which he got more craze in tollywood also.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ పెదనాన్న నటించడమా? అసలు ఆయన ఎవరు? అని అనుకుంటున్నారా! అంతగా ఆశ్చర్యపోకండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది రియల్ లైఫ్ పెదనాన్న గురించి కాదు.. రీల్ లైఫ్ పెదనాన్న గురించి! ఈ ఏడాదిలో టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో తారక్‌కి పెదనాన్నగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన విషయం తెలిసిందే. ఆయన పవన్ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

సాధారణంగా త్రివిక్రమ్ తన ప్రతీ సినిమాలోనూ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకుంటాడు. పవన్‌తో తీయబోయే మూవీలోనూ అలాంటిదే ఓ రోల్ ఉందట. తొలుత ఈ పాత్రకు ఉపేంద్రని తీసుకుందామని త్రివిక్రమ్ భావించాడట. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఆల్రెడీ అతను ఓ కీ-రోల్ పోషించాడు. ఈసారి అతనితోనే చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడట. కానీ.. ఇంతలోనే మనసు మార్చుకుని మోహన్‌లాల్‌ వైపు తన దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఏడాది ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’, ‘మన్యం పులి’ సినిమాలతో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. దీంతో.. తన సినిమాలో ఉన్న స్పెషల్ రోల్‌కి ఆయన్ను తీసుకుంటే, తెలుగు ఆడియెన్స్ త్వరగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో మోహన్‌లాల్‌నే తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట.

అటు.. మోహన్‌లాల్ కూడా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పవన్-త్రివిక్రమ్ సినిమాకు ఆయన ఓకే అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న రాధాకృష్ణ మోహన్ లాల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి.. ఆయన ఓకే అంటాడో లేదో చూడాలి.

Leave a comment