పార్టీలో నానా రచ్చ చేసిన ఎన్టీఆర్, రవితేజ, వర్మ, పూరీ.. రాజమౌళి కూడా!

temper-succes-party

Tollywood big celebrities like NTR, Raviteja, RGV, Puri Jagannadh, Sachin, Bandla Ganesh And Rajamouli had enjoyed a lot in Temper success event. This video going viral on internet for real behaviour of all of them. See how they behave in real life in the below video.

వెండితెర మీద ఆడియెన్స్‌ని అలరించే సెలబ్రిటీల రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడంలో ప్రతిఒక్కరికీ క్యూరియాసిటీ ఉంటుంది. నిజ జీవితంలో వాళ్లు ఎలా బిహేవ్ చేస్తారు..? నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకుంటారు? వెండితెర మీద కనిపించినట్లుగానే రియల్ లైఫ్‌లో ఉంటారా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు అందరినీ వెంటాడుతూనే ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకోవడం చాలా కష్టం కానీ.. అప్పుడప్పుడు వారి రియల్ లైఫ్‌కి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో తారక్, రవితేజ, వర్మ, పూరీ, రాజమౌళితోపాటు మరికొందరు సెలబ్రిటీలు కనిపించారు.

నిజానికి.. ఈ వీడియో ‘టెంపర్’ హిట్ అయిన తర్వాత రికార్డ్ చేసింది. అప్పట్లో ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో.. దాన్ని పురస్కరించుకుని నిర్మాత బండ్లగణేష్ ఓ ప్రత్యేక పార్టీ ఇచ్చాడు. ఈ ఈవెంట్‌కి పూరీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఇతర సెలబ్రిటీలను ఆహ్వానించాడు. ఇంకేముంది.. అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో నానా హంగామా చేశారు. పైగా.. ఇది ప్రైవేట్ పార్టీ కావడంతో రచ్చ మామూలుగా చేయలేదు. అందరూ తమ ఒరిజినాలిటీనే చూపించారు. సెల్‌ఫోన్, సాధారణ కెమెరాల్లో రికార్డ్ చేస్తున్నారన్న సంగతి పట్టించుకోకుండా.. మనసారా భలే ఎంజాయ్ చేసుకున్నారు. ఈ వీడియో చూస్తే.. ఇలాంటి ఈవెంట్ మన లైఫ్‌లోనూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. గతంలోనే ఈ ఈవెంట్‌కి సంబంధించి ఓ వీడియో లీక్ అయ్యింది. అయితే.. ఈసారి HD వీడియోని విడుదల చేశారు. మీరూ ఆ వీడియో చూసి.. ఎంజాయ్ చేయండి..

Leave a comment