Moviesసెన్సార్ కార్య‌క్ర‌మాల్లో స్టార్‌మేకర్‌ సత్యానంద్‌ నటించిన ‘నేత్ర’ !

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో స్టార్‌మేకర్‌ సత్యానంద్‌ నటించిన ‘నేత్ర’ !

రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఇటీవ‌ల ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో విడుద‌లై పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల మాట్లాడుతూ….`‘ ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. యూనిట్ అంతా క‌లిసి రీసెంట్ గా ఫ‌స్ట్ కాపీ చూశాము. సినిమా ప‌ట్ల ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నాం. దర్శకుడు చిత్రాన్ని చెప్పిన దానికంటే కూడా ఎంతో బాగా తెర‌కెక్కించాడు. ఆడియో సినిమా పై క్రేజ్ ని పెంచింది. ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయన్నారు.

చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ… ‘ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్ గా `నేత్ర‌` చిత్రం తెర‌కెక్కించాము. ఆడియన్స్‌కి కావాల్సిన ఆల్ కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. హీరో గోపిచ‌ర‌ణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య బాగా నటించారు. కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. మా నిర్మాతకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టార్ మేక‌ర్ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి తొలిసారిగా మా చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ స‌మ‌కూర్చిన పాట‌లు …విన్న‌వారంద‌రూ చాలా బాగున్నాయంటున్నారు. ఒక్కో పాట ఒక్కోక‌రిని ఆక‌ట్టుకుంటోంది. నేప‌థ్య సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్ళారు మా సంగీత ద‌ర్శ‌కుడు. ఫస్ట్ కాపీ చూసిన మా నిర్మాత మ‌రియు టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సినిమా విడుద‌ల‌య్యాక ఆడియ‌న్స్ కి కూడా మా సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంద‌న్న కాన్ఫిడెన్స్ క‌లిగింద‌న్నారు.

గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమల‌రెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌ తదిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు: ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా: ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి: లుక్స్‌ రాజశేఖర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news