Newsహలో ఫ్యాన్స్.. ఇప్పటికైనా మారండి.. ఫోటో ద్వారా మహేష్, చరణ్‌ల మెసేజ్

హలో ఫ్యాన్స్.. ఇప్పటికైనా మారండి.. ఫోటో ద్వారా మహేష్, చరణ్‌ల మెసేజ్

Prince Mahesh Babu and Ram Charan gave a simple message to their fans with only one photograph along with Beyond Boundaries tagline.

వృత్తిపరంగా స్టార్ హీరోల మధ్య పోటీ ఉండటం సహజం కానీ.. వ్యక్తిగతంగా వారిమధ్య ఎలాంటి విభేదాలూ ఉండవు. అందరూ స్నేహంగానే మెలుగుతారు. అభిమానులే.. అనవసరంగా రెచ్చిపోతుంటారు. తమ హీరో గొప్పంటే తమ హీరోనే గొప్ప అంటూ డప్పులు వాయించుకోవడం తప్ప.. వారిలాగే స్నేహంగా ఉండటానికి ఇష్టపడరు. ఏదో చిన్న కామెంట్ చేస్తేనే చంపుకునే స్థాయికి దిగరాజారారంటే.. వారిలో ‘అభిమానం’ సెగ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య వ్యక్తిగత తగాదాలు కాస్తంత తగ్గాయి కానీ.. సోషల్ మీడియాలో మాత్రం బండబూతులు తిట్టుకుంటున్నారు.

ఒక హీరోకి సంబంధించిన అభిమానులు ఇతర కథానాయకుల ఫోటోల్ని వక్రీకరిస్తూ.. కుళ్లుజోకులు వేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఇదే రచ్చ. ప్రిన్స్ మహేష్‌బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అంతే. తమ హీరోనే గ్రేట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో గొడవలు పడుతున్నారు. ఇలాంటివారికి ఆ హీరోలిద్దరూ ఓ ఫోటో ద్వారా చక్కని మెసేజ్ ఇచ్చారు. ‘తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మీరెందుకు అనవసరంగా రెచ్చిపోతున్నారు’ అని ఒక ఫోటో ద్వారా చెప్పకనే చెప్పారు. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో చూస్తే.. ఆ విషయం ప్రతిఒక్కరికి అర్థం అవుతుంది. అంతేకాదు.. ‘బియాండ్ బౌండరీస్’ అనే ట్యాగ్‌ పెట్టి, అందరినీ ఆలోచింపజేశారు.

ప్రస్తుతం మహేష్ తన భార్యాపిల్లలతోపాటు బావ గల్లా జయదేవ్ ఫ్యామిలీతో కలిసి యూరోప్ వెకేషన్‌లో ఉన్నాడు. న్యూ ఇయర్‌ను లండన్‌లో జరుపుకునేలా పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు వీరితోపాటు రామ్ చరణ్ కూడా జత అయ్యాడు. షార్ట్ హాలిడేస్ అంటున్న చరణ్.. కొన్ని రోజులు మహేష్ కుటుంబంతోనే గడపనున్నాడట. మహేష్ బాబు, అతని భార్య నమ్రత, రామ్ చరణ్, అతని వైఫ్ ఉపాసన..అందరూ కలిసి చక్కర్లు కొడుతున్న సంగతిని అఫీషియల్‌గానే సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అంతే కాదు.. ‘బియాండ్ బౌండరీస్’అనే ట్యాగ్ అందరూ వాడడం కనిపించింది.

దాని అర్థం.. ఏదో ఖండాలు దాటిపోయామని వాళ్లు చెబుతున్నట్లు కాదు. ‘తమ మధ్య ఎన్ని సరిహద్దులున్నా.. తామంతా ఒకటే’ అని అర్థం వచ్చేలా ఆ పదాన్ని వాళ్లు వినియోగిస్తున్నారు. అంటే.. డైరెక్ట్‌గానే ఫ్యాన్స్ అందరూ తమలాగే సన్నిహితంగా ఉండండని, అనవసరంగా గొడవలు దిగొద్దని ‘బియాండ్ బౌండరీస్’ పదంతో చెప్పేశారు. సో ఫ్యాన్స్.. ఇప్పటికైనా మారండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news