Gossipsమహేష్-మురుగదాస్ సినిమా.. స్టోరీలైన్ పాతదే కానీ, అదే అసలైన ట్విస్ట్!

మహేష్-మురుగదాస్ సినిమా.. స్టోరీలైన్ పాతదే కానీ, అదే అసలైన ట్విస్ట్!

An interesting update has came out about Mahesh Babu and AR Murugadoss combo film. According to the latest news, this movie storyline is old but there is a twist which turns the whole story. Read below story to know what is that twist.

ప్రిన్స్ మహేష్‌బాబు, ఏఆర్ మురుగదాస్.. ఈ ఇద్దరికీ దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌తోపాటు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్స్‌సమ్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసే హీరోగా మహేష్‌కి పేరుంటే.. టాలెంటెడ్ డైరెక్టర్‌గా మురగకి ఓ గుర్తింపు ఉంది. అలాంటి వీరి కాంబినేషన్‌లో తొలిసారి ఓ సినిమా వస్తుండడంతో.. మొదటినుంచే దానిపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ప్రతిఒక్క అప్‌డేట్ తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్‌తోపాటు సినీజనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివారికి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ స్టోరీలైన్ బయటకు వచ్చేసింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథ మరీ కొత్తగా ఏమీ ఉండదని, టెస్టెడ్ అండ్ సక్సీడ్ ఫార్ములాతోనే మురుగ స్టోరీని రెడీ చేశాడని తెలుస్తోంది. కథ ప్రకారం.. ఒకరు మంచోడు, ఇంకొకరు చెడ్డవాడైన అన్నదమ్ముల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. మహేష్‌కి బ్రదర్‌గా ఎవరు నటిస్తున్నారన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఈ మూవీ కథ పాతదే అయినా.. దర్శకుడు మురుగదాస్ తనదైన స్టయిల్‌లో ఇంటెన్సిటీతో రూపొందిస్తున్నాడని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగానే కమర్షియల్ చిత్రాల్లో తన ఫ్లేవర్ కలిపి రక్తికట్టించే ఈ డైరెక్టర్.. మహేష్ సినిమాని మరింత ఆసక్తికరంగా ఉండేలా, ప్రతి సన్నివేశం ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జే.సూర్య, మరో తమిళ హీరో భరత్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ ముగించి.. ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news