సోషల్ మీడియాలో నిప్పు రాజేసిన ఆ ఒక్క ‘పేరు’

kareena kapoor saif ali khan son taimur name ruckus on social media

Kareena Kapoor and Saif Ali Khan’s son name Taimur become a controversy on social media.

బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్‌కి కొడుకు పుట్టినప్పటి నుంచి వాళ్లు వార్తల్లో తెగ నానుతూనే ఉన్నారు. కొడుకు పుట్టినందుకు ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కూడా ఆ జంటకి విష్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఎప్పుడైతే ఆ జంట తమ తనయుడి పేరు ‘తైమూర్ అలీ ఖాన్ పటౌడీ’ అని ప్రకటించారో, ఆ క్షణం నుంచే అగ్గిరాజుకుంది. ప్రతిఒక్కరూ ఆ బాబు పేరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనాలందరూ అంతలా ఆ పేరు మీద మండిపడ్డానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? అది తెలియాలంటే.. ఓసారి చరిత్రలోకి వెళ్ళాల్సిందే.

చరిత్రలో ఉన్న అత్యంత రాక్షస రాజుల్లో తైమూర్ ఒకడు. ఆరోజుల్లో అలెగ్జాండర్, చెంగిజ్ ఖాన్‌లాంటి వాళ్లు చేయలేని ఓ సాహసాన్ని తైమూర్ చేశాడు. 1398లో ఢిల్లీపై దండయాత్ర చేయాలని ప్లాన్ వేశాడు. అయితే.. ఢిల్లీ సుల్తాన్ అయిన తుగ్లక్ దగ్గర ఏనుగుల బలం ఉందని అతనికి తెలిసింది. వాటిని ఎదురించాలంటే.. సైనికుల వల్ల కాదు. దాంతో.. అతడు అంతకుమించి ఓ పథకం రచించాడు. ఒంటెలను రంగంలోకి దించాడు. ఆ ఒంటెలకు కట్టెలు కట్టి.. వాటికి నిప్పంటించి.. వాటిని ఇనుప రాడ్లతో కొట్టాడు. ఆ బాధను తట్టుకోలేక ఆ ఒంటెలు దూసుకెళ్లాయి. దాంతో.. ఏనుగులు బెంబేలెత్తాయి. ఆ దెబ్బకు సుల్తానేట్ సైన్యాన్ని నాశనం అయ్యింది. అలా ఒంటెలతో ఢిల్లీపై దండయాత్ర చేసిన తైమూర్.. ఆ తరువాత మూడు రోజులు ఢిల్లీలో లక్షమందిని దారుణంగా చంపేశాడు. అంతటితో అతడు ఆగలేదు.. చనిపోయిన వారి తలలు గోడలకు వేలాడతీసి.. బాడీలను పక్షులకు వేసేశాడు.

అలాంటి చరిత్ర గల ‘తైమూర్’ పేరు కరీనా తన కొడుక్కి ఎలా పెడుతుందంటూ సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు రెచ్చిపోయారు. వెంటనే పేరు మార్చాలంటూ డిమాండ్ కూడా చేశారు. కొందరైతే.. కరీనా, సైఫ్ మీద తిట్లపురాణం కూడా సంధించాడు. ఈ కామెంట్లపై ఆ జంట ఇంతవరకు స్పందించలేదు గానీ.. కరీనా బాబాయ్ రిషికపూర్ మాత్రం అందరూ ఖంగుతినేలా రిప్లై ఇచ్చాడు. ‘తమ కొడుక్కి ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టం. ఆ మాటకొస్తే అలెగ్జాండర్.. సికందర్ వంటి వారు గొప్పోళ్ళేం కాదు. మీ పని మీరు చూసుకోండి. అసలు కామెంట్ చేయడానికి మీరెవరు? షట్ ది ఫక్ అప్’ అంటూ ట్వీటాడు. ఆ విధంగా ఆయన చేసిన ట్వీట్ మీద కూడా జనాలు మండిపడుతున్నారు. మొత్తానికి.. బాబు పుట్టిన ఆనందం కంటే ‘తైమూర్’ తెచ్చిన తంటాలు కరీనా-సైఫ్‌కి తలనొప్పిగా మారింది.

Leave a comment