Gossipsతమ్ముడి సినిమాకి అన్నయ్య ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

తమ్ముడి సినిమాకి అన్నయ్య ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

Everyone knows that young tiger NTR doing his next film with director Bobby under his brother Kalyan Ram’s NTR Arts banner. According to latest updates, kalyan has put some conditions on budget and fixed a figure.

బాబీ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేయనున్న సినిమాని అతని అన్నయ్య కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ హాట్ టాపిక్ బయటికి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కళ్యాణ్ రామ్ కండీషన్స్ పెట్టాడని సమాచారం. ఈ మూవీకి అతను ఓ అమౌంట్ కేటాయించాడని, అంతకుమించి ఎక్కువ ఖర్చు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. ఇదే విషయమై బాబీతోనూ చర్చలు జరిపాడని, కళ్యాణ్ చెప్పినట్లుగా బాబీ కూడా ఆ బడ్జెట్‌లోనే సినిమా తెరకెక్కిస్తానని మాటిచ్చాడని తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి రూ.45 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేశాడట. అంతకుమించి ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూడాలని, బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాల్సిందేనని కళ్యాణ్ కండీషన్స్ పెట్టాడట. నిజానికి.. ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఎంతోమంది ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం అతనికున్న క్రేజ్ దృష్ట్యా.. రూ.60-70 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సై అంటున్నారు. అలాంటిది.. తన సొంత తమ్ముడు సినిమా విషయంలో కళ్యాణ్ ఎందుకు కండీషన్స్ పెట్టాడనే సందేహాలు రావొచ్చు. అందుకు ఓ బలమైన కారణం ఉందిలెండి.

కళ్యాణ్ తన సొంత బ్యానర్‌లో ఇదివరకు తీసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువయ్యాయి. ముఖ్యంగా.. ‘ఓం త్రీడీ’, ‘కిక్-2’, ‘ఇజం’ మూవీలు అతనికి భారీ నష్టం మిగిల్చాయి. అందుకే.. ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలని కళ్యాణ్ డిసైట్ అయ్యాడట. తారక్ ఆల్రెడీ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడు. ఇక ఇతర నటీనటుల పారితోషికం, ఖర్చులను రూ.45 కోట్లలోపే అయ్యేలా కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ మూవీతో గత నష్టాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే.. కళ్యాణ్ అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news