జయలలిత ‘చీర’ ఎపిసోడ్ : అసలు ఆరోజు ఏం జరిగింది..?

jayalalitha saree episode in tamilnadu assembly

Jayalalitha faced many problems in her life to build a career in Politics. Once there was an incident happened like draupadi vastraharan in Assembly which shocks whole Tamilnadu state.

తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన జయలలిత.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో అవమానాల్లో ఓ ఎపిసోడ్ చాలా వివాదాస్పదమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అది సభ్యసమాజం తలదించుకునే ఘటన. నిండు సభలో ఒక స్త్రీ అని చూడకుండా దుశ్వాసన పర్వానికి తెరదీశారు. ఈ సంఘటన 1989 మార్చి 25వ తేదీన వెలుగుచూసింది. ఇంతకీ.. ఆరోజు ఏమైంది? ఆ వివరాలు తెలుసుకోవడానికి మేటర్‌లోకి వెళ్దాం పదండి…

ఏఐడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సహాయంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయలలిత.. అప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆరోజు ఆయన సభకు హాజరు కాకపోవడంతో.. జయలలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘సీఎం అయి ఉండి కూడా కరుణానిధి ఎందుకు రాలేదు’ అని ప్రశ్నించారు. ఈమె ప్రశ్నకు మండిపడ్డ డీఎంకే సభ్యులు.. ‘గతంలో ఎంజీఆర్ కూడా గైర్హాజరయిన సందర్భాలు లేవా’ అంటూ ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో అప్పటి కరుణానిధి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న దురై మురుగన్ తన చీర లాగారని జయలలిత ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన జయలలిత.. సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి, సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. చివరికి ఆమె అనుకున్నట్లుగానే సీఎం పీఠం అధిష్టించారు.

ఆనాడు సభలో జరిగిన మొత్తం ఎపిసోడ్ K.K.S.S.రామ‌చంద్ర‌న్‌కు తెలుస‌ునని.. కానీ ఆయన నోరు విప్పే పరిస్థితుల్లో లేరని జయ ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ఎందుకంటే.. అప్ప‌టికే ఆయ‌న డీఎంకే పార్టీలో చేరార‌ని, అందుకే తన ఘటనపై పెదవి విప్పడం లేదని తెలిపింది.

Leave a comment