10వ రోజు ‘నాన్-బాహుబలి’ రికార్డ్ సృష్టించిన ‘ధృవ’

dhruva create non-baahubali record with 10th day collections

Ram Charan’s latest movie Dhruva has created non-baahubali record by earning highest collections on 10th day.

సాధారణంగా రోజులు గడిచేకొద్దీ సినిమా వసూళ్లు తగ్గుతూ వస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ డల్ అవుతూ వస్తాయి. సెకండ్ వీకెండ్‌లోనూ అదే బాపతు. కానీ.. ‘ధృవ’ విషయంలో పూర్తి భిన్నంగా రిజల్ట్ వచ్చింది. తొలి వారాంతం తర్వాత ఈ సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుతూ వస్తే.. రెండో వారాంతంలో అంచనాలకు మించే వచ్చాయి. శుక్రవారమే కలెక్షన్లు కాస్త పెరగ్గా.. శనివారం మరింత పెరిగాయి. ఇక 10వ రోజైన ఆదివారంనాడు ఏకంగా ‘నాన్-బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేసింది ‘ధృవ’.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 10వ రోజు ‘ధృవ’ రూ.1.90 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. 10వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘బాహుబలి’ (రూ.3.4 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా.. ‘ధృవ’ రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. అంతకుముందు రూ.1.70 కోట్లతో ‘సరైనోడు’ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. ‘ధృవ’ దాన్ని బీట్ చేసి ‘నాన్-బాహుబలి’ రికార్డ్ సృష్టించింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం, విడుదలైన చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ‘ధృవ’కి కలిసొచ్చిందని అంటున్నారు.

Leave a comment