Moviesవిజయ్ ఆంటోనీ ‘బేతాళుడు’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

విజయ్ ఆంటోనీ ‘బేతాళుడు’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Finally Vijay Antony’s latest film Bethaludu has released on Thursday (01-12-2016) with huge expectations. Let’s us see the review of this film and how it attracted the audience.

సినిమా : బేతాళుడు
నటీనటులు : విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్, చారుహాసన్, కమల్ కృష్ణ, తదితరులు
రచన-దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్
మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : ప్రదీప్ కళిపురయత్
ఎడిటర్ : వీర సెంథిల్ రాజ్
రిలీజ్ డేట్ : 01-12-2016

‘బిచ్చగాడు’ మూవీతో సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు ‘బేతాళుడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో విజయ్ సరసన అరుంధతి నాయర్ కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం.. ఆ తర్వాత టీజర్, ట్రైలర్స్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇక హీరో విజయ్ ఎన్నడూలేని విధంగా తొలిసారి ఈ చిత్రం విభిన్నంగా ప్రమోట్ చేశాడు. విడుదలకు ముందే సినిమాలోని 15 నిముషాల భాగాన్ని విడుదల చేయడంతోపాటు వీడియో పాటల్ని కూడా రిలీజ్ చేశాడు. దాంతో.. ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి.. వాటిని ఈ చిత్రం అందుకుందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం…

కథ :
దినేష్ (విజయ్ ఆంటోనీ) ఒక ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవితం గడుపుతుంటాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో.. దినేష్ ఉన్నట్లుండి ఒక మానసిక రుగ్మతకు గురవుతాడు. ఎవరో తనను వెంటాడుతున్నట్టు భాధపడుతుంటాడు. ఆలా బాధపడుతున్న దినేష్.. ట్రీట్మెంట్ కోసం ఓ డాక్టర్‌ని కలుస్తాడు. ఆ డాక్టర్ పరీక్షించిన అనంతరం.. గత జన్మ తాలూకు జ్ఞాపకాలు దినేష్‌ని వెంటాడుతున్నాయని నిర్ధారిస్తాడు.

కట్ చేస్తే.. ఆ గత జన్మ జ్ఞాపకాల్లో జయలక్ష్మి అనే మహిళని దినేష్ వెతుకుతూ ఉంటాడు. ఆమె ఎవరో తెలుసుకునేలోపే.. సాధారణ జీవితంలోకి వచ్చేస్తాడు. ఇలా పూర్వ జన్మ జ్ఞాపకాలకు, ప్రస్తుతానికి మధ్య దినేష్ నలిగిపోతుంటాడు. ఆ జ్ఞాపకాల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు దినేష్ ఎంతగా ప్రయత్నించినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంతకీ.. దినేష్ ఉన్నట్లుండి ఎలా మానసిక రుగ్మతకి గురవుతాడు..? ఎందుకు అతనికి సడెన్‌గా గతజన్మ గుర్తుకొచ్చింది..? తన జ్ఞాపకాల్లో దినేష్ వెతుకుతున్న ఆ జయలక్ష్మి ఎవరు..? ఆ గత జన్మ నైపథ్యం ఏమిటి..? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
అమ్మ సెంటిమెంట్‌తో కోట్లు కొల్లగొట్టిన ‘బిచ్చగాడు’.. ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్‌తో తెలుగు ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేయడంలో విజయవంతం అయ్యాడు. అంచనాలకు తగ్గట్టుగానే బలమైన కథ, క్రిస్పీ స్ర్కీన్‌ప్లే, ట్విస్టులతో కట్టిపడేశాడు. మధ్యమధ్యలో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ.. ఓవరాల్‌గా చూస్తే ఈ ప్రయోగాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ ‘బేతాళుడు’ చిత్రం.. విజయ్ ఆంటోనీ చేసిన భిన్నమైన ప్రయోగాల్లో ఒకటిగా నిలుస్తుంది.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. మొదటినుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడా థ్రిల్ మిస్ అవ్వకుండా ఆసక్తికరంగా సాగుతుంది. హీరో మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ.. దాని చుట్టు రాసిన సీన్లు, వెండితెరపై వాటిని చూపించిన తీరు కట్టిపడేస్తాయి. అక్కడక్కడ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఆ సీన్ మూడ్‌లోకి తీసుకెళ్తాయి. కొన్ని సీన్ల దగ్గరైతే.. హారర్ మూవీ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. గత జన్మలో జయలక్ష్మిని వెతుక్కుంటూ దినేష్ వెళ్ళడం, ఆమె విషయాలు తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్లు.. ఔరా అనిపించేలా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే దిమ్మతిరిగే ట్విస్ట్‌తో ముగుస్తుంది. సెకండాఫ్ మీద మరింత ఆసక్తి పెంచుతుంది. అదే ఆసక్తితో మొదలయ్యే సెకండాఫ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. గతజన్మ, ప్రస్తుతానికి మధ్య కథని నడిపిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ చాలా సహజంగా నడుస్తుంది. అయితే.. కాస్త నెమ్మదించడంతో అక్కడకడ్కా బోర్ కొడుతుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహించిన స్థాయిలో ఉండదు. ఉన్నట్లుండి కథ ట్రాక్ మారడంతో.. క్లైమాక్స్‌పై మీద ఉండే అంచనాలు తారుమారు అవుతాయి. మొత్తంగా చూస్తే.. సెకండాఫ్ కంటే ఫస్టాఫే ఈ మూవీకి మేజర్ హైలైట్.

సైకలాజికల్ థ్రిల్లర్‌కి కాస్త హర్రర్ టచ్ ఇచ్చిన ఈ సినిమాకి ఫస్టాఫ్ కథ, కథనాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్ కొంత భాగం, విజయ్ ఆంటోనీ నటన ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం, ఉన్నట్టుండి కథ ట్రాక్ మారిన విధానం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్‌లు మైనస్ పాయింట్స్. వాటిని నెగ్లెక్ట్ చేస్తే.. ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా మంచి అనుభూతినిస్తుంది.

నటీనటుల పనితీరు :
విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో కట్టిపడేశాడు. ప్రస్తుత జన్మలోని దినేష్, గత జన్మలోని శర్మ పాత్రలకు మధ్య ఆంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా మొత్తాన్ని తన భుజాలమీద నడిపించాడు. ఇక హీరోయిన్‌ అరుంధతి నాయర్ తన నటనతో ఫర్వాలేదనిపించింది. ఇతర నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక పనితీరు :
ఈ మూవీకి ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని గ్రాండ్‌గా చూపించాడు. తన కెమెరా పనితనంతో ఆ మూడ్‌లోకి తీసుకెళ్ళాడు. లొకేషన్లను కూడా బాగా చూపించాడు. విజయ్ ఆంటోనీ అందించిన ఫర్వాలేదనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరింది. ఇది ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి గురించి మాట్లాడితే.. అతని ఎంచుకున్న కథ, రాసుకుని కథనాన్ని స్ర్కీన్‌పై క్లీన్‌గా చూపించాడు. దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. కానీ.. సెకండాఫ్‌లో ఉన్నట్టుండి ట్రాక్ మార్చేసి, క్లైమాక్స్‌లో నిరుత్సాహ పరిచాడు. వీటిలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండుంటే.. బాగుండేది.

చివరగా : ఫస్టాఫ్ అదిరింది.. సెకండాఫ్ నెమ్మదించింది..
‘బేతాళుడు’ మూవీ రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news