పవన్ కళ్యాణ్‌ తక్కువ టైంలో అరుదైన మైలురాయి…రజనీ తర్వాత పవన్‌దే ఆ రికార్డ్!!

pawan kalyan twitter account

Powerstar Pawan Kalyan has reached a milestone on twitter which is rare record created by him after Superstar Rajinikanth in South Film Industry. This prove how much craze has pawan in Tollywood. On the otherside, Pawan busy with Katamarayudu shooting which is going to release on next year March 29.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి టాలీవుడ్‌లో ఏ రేంజులో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు హీరోల్లోకెల్లా ఏ ఒక్కరికీ సాధ్యంకాని రీతిలో ఆయన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తిత్వమే ఆయనకు కోట్లాదిమంది అభిమానుల్ని తెచ్చిపెడుతోంది. ఇక ‘జనసేన’ పార్టీ పెట్టాక పవన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇందుకు నిదర్శనం.. తాజాగా పవర్‌స్టార్ సాధించిన అరుదైన రికార్డే. 2014లో పవన్ ట్విటర్ ఖాతా ఓపెన్ చేయగా.. 1 మిలియన్ ఫాలోవర్స్‌ని దాటేశాడు.

నిజానికి.. పవన్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు. తన సినిమాలకు సంబంధించిన వార్తల్ని అస్సలు ట్వీట్ చేయడు. కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే ట్వీట్ చేస్తాడు. అలా ట్వీట్ చేసిన ప్రతిసారీ అది వైరల్ అవుతూ ఉంటుంది. ఈ కారణంగా కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా.. 100 ట్వీట్లు కూడా దాటకుండానే 1 మిలియన్ ఫాలోవర్స్‌ని దాటేయడం పవన్ క్రేజ్‌కి అద్దం పడుతోంది. దక్షిణాది ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రేర్ రికార్డ్ సాధించాడు.

కాగా.. పవన్ ప్రస్తుతం డాలీ దర్వకత్వంలో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత పవన్ మరో రెండు చిత్రాల్ని కూడా అప్పుడే లైన్‌లో పెట్టేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలోపు వాటిని కూడా కంప్లీట్ చేసి, ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించాలన్నదే పవన్ ప్లాన్

Leave a comment