Gossipsఆ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా..?

ఆ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా..?

A flop director who has done a movie with Pawan Kalyan is making a plan to do next film with young tiger NTR. Actually that director’s asociated with Raviteja but that project shelved before going on floors because of financial problem.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తుండగానే.. మరో మూవీని లైన్‌లో పెడతాడు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాల్ని ముగించేస్తాడు. కానీ.. ఈసారి మాత్రం తారక్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. గతంలో ఎన్నికల కారణంగా ఒకేడాది ప్రచారం కోసమే సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి వ్యవహారాలు, అవసరమైన వ్యక్తిగత పనులు లేకపోయినా.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ఇంకా కన్ఫమ్ చేయలేదు. ‘గ్యారేజ్’ విడుదలైన మూడు నెలలవుతున్నప్పటికీ.. నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నాడు. మధ్యలో కొందరు దర్శకులు చెప్పిన స్టోరీలు విన్నాడు కానీ.. ఏవీ నచ్చకపోవడంతో పక్కన పెట్టేశాడు. దీంతో.. ఏ దర్శకుడితో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేస్తాడా? అని ఆలోచిస్తున్న సమయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. డైరెక్టర్ బాబీ త్వరలోనే తారక్‌కి ఓ కథ వినిపించేందుకు రెడీ అవుతున్నాడట. ‘సర్దార్’తో కోలుకోలేని షాక్ తిన్న బాబీ.. దాన్నుంచి తేరుకోవాలంటే పెద్ద హిట్ కావాల్సిందే. అందుకే.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో వున్న ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి.. బాబీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ రవితేజతో చేయాల్సింది. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఓకే అయ్యింది. ఇక త్వరలోనే సెట్స్ మీదకి వెళుతుందనుకుంటే.. చివరి నిముషంలో నిర్మాత ఆర్థిక కారణాల వల్ల వెనకడుగు వేశాడు. దీంతో.. రవితేజ కోసం రాసుకున్న కథని ఎన్టీఆర్‌కి వినిపించి, అతనితో సినిమా ఓకే చేయించుకుందామని బాబీ భావిస్తున్నాడట. కోన వెంకట్, గోపీ మోహన్ సహకారంతో తాను డెవలప్ చేసిన కథ చాలా పవర్‌ఫుల్‌గా, కొత్త కాన్సెప్ట్‌తో కూడి ఉండడంతో.. తన స్టోరీకి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని బాబీ నమ్మకంగా ఉన్నాడట. మరి.. అతని నమ్మకాన్ని ఎన్టీఆర్ నిలబెడతాడా? లేదా? వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news