Gossipsచివరికి ఆ దర్శకుడి బుట్టలో పడ్డ ఎన్టీఆర్.. కానీ!

చివరికి ఆ దర్శకుడి బుట్టలో పడ్డ ఎన్టీఆర్.. కానీ!

Finally a young director has impressed young tiger NTR with his story line. After listening the line, Tarak told director to develop full script. Now, fans are eagerly waiting that director can impress with full script or not. Let’s wait for final result.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేస్తాడా? అనే ప్రశ్న అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాల్ని ఉత్కంఠలో నెట్టేసింది. మధ్యలో చర్చలు జరిపిన ఐదారుమంది దర్శకుల్లో ఎవరైనా ఒకరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనుకుంటే.. అదీ జరగలేదు. వాళ్ళు చెప్పిన స్టోరీలైన్‌లు అంతగా ఆసక్తికరంగా లేకపోవడంతో.. అందరినీ రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో.. ఎన్టీఆర్‌ని ఇంప్రెస్ చేయగలిగే ఆ డైరెక్టర్ ఎవడా? అని అనుకుంటున్న తరుణంలో.. చివరికి ఓ డైరెక్టర్ బుట్టలో ఈ హీరో పడిపోయాడని వార్త వెలుగులోకి వచ్చింది. అతను మరెవ్వరో కాదు.. బాబీ.

‘పవర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలను తెరకెక్కించిన బాబీ.. ఎన్టీఆర్‌కి ఓ కథ వినిపించేందుకు రెడీ అవుతున్నాడని ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అతనితో సంప్రదింపులు జరిపి.. తన స్టోరీలైన్‌తో మెప్పించాడట. కాన్సెప్ట్ సరికొత్తగానూ, పవర్‌ఫుల్‌గానూ ఉండడంతో.. పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమని బాబీకి ఎన్టీఆర్ చెప్పాడట. దీంతో.. బాబీ ఆ పనిలో నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. నిజానికి.. బాబీ తన తదుపరి చిత్రం రవితేజతో చేయాల్సింది. కానీ.. ఆర్థిక కారణాల వల్ల ఆ మూవీ పట్టాలెక్కకముందే అటకెక్కింది. దీంతో.. రవి కోసం తయారు చేసిన స్టోరీకి తారక్ కరెక్ట్‌గా సరిపోతాడని భావించాడు.

అలా అనుకున్న వెంటనే బాబీ రంగంలోకి దిగడం, ఎన్టీఆర్‌కి కథ వినిపించడం, అది నచ్చడంతో పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమని హారో చెప్పడం.. అంతా చకచకా జరిగిపోయింది. అయితే.. స్టోరీలైన్‌తో తారక్‌ని ఇంప్రెస్ చేయగలిగిన బాబీ, పూర్తి స్ర్కిప్ట్‌తో మెప్పించగలడా? లేదా? అనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. దానికి సమాధానం తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news