Gossipsఇజం...ఆ సమస్యలను సాల్వ్ చేసిన ఎన్టీఆర్!!

ఇజం…ఆ సమస్యలను సాల్వ్ చేసిన ఎన్టీఆర్!!

ప్రస్తుతం నందమూరి బ్రదర్స్ మధ్య ప్రేమానురాగాలు మామూలుగా లేవు. అభిమానులతో పాటు, సినిమా లవర్స్ కూడా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లను చూసి చాలా నేర్చుకోవచ్చు. అన్నదమ్ములంటే ఎలా ఉండాలి అని చాలా మందికి నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళ రిలేషన్. కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాను కూడా తన సొంత సినిమాలా భావిస్తున్నాడు ఎన్టీఆర్. చాలా కాలంగా చాలా చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాలతో పాటు మాస్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్‌కి ఎదగలేకపోయాడు కళ్యాణ్ రామ్.

అందుకే తనకు టెంపర్ లాంటి మేకోవర్ ఫిల్మ్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించేలా చేశాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే పూరీ రేంజ్ టాప్ డైరెక్టర్‌తో చేయడం ఇదే ఫస్ట్ టైం. టెంపర్‌లో లాగే ఇందులో కూడా హీరోని సిక్స్ ప్యాక్‌లో చూపిస్తున్నాడు. ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని అనిపిస్తోంది. అయితే బడ్జెట్ మరీ ఎక్కువగా బోర్డర్స్ దాటేసిందని తెలుస్తోంది. సినిమా కొనడానికి బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వెనుకా ముందు ఆడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ మరోసారి సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. తన జనతా గ్యారేజ్ సినిమాని కూడా అందరూ దగ్గరవాళ్ళకే ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళచేతే ‘ఇజం’ సినిమాని కూడా కొనిపించాడు. దిల్ రాజుతో సహా అందరినీ కూడా ఇజం సినిమా బిజినెస్‌లో భాగమయ్యేలా చేశాడు. అయితే అడ్వాన్స్‌లు ఇచ్చి కమిషన్‌లపై సినిమాను రిలీజ్ చేస్తున్నారో లేకపోతే పూర్తిగా సినిమాను కొనేసి రిలీజ్ చేస్తున్నారో తెలియరాలేదు. ఓవరాల్‌గా మరోసారి కళ్యాణ్ రామ్ కష్టాలను తీర్చేశాడు ఎన్టీఆర్.

అలాగే ఇజం సినిమాను ఈ నెల 20న రిలీజ్ చేస్తే బాగుంటుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ కళ్యాణ్ రామ్‌కి సలహాలు ఇచ్చారట. అయితే ఆ రోజుతో జనతా గ్యారేజ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోోతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్ముడి సినిమాకు నష్టం జరిగే పని నేను చేయనని కళ్యాణ్ రామ్ కరాఖండీగా చెప్పేశాడట. ఆ తర్వాత 21 అనుకున్నారు కానీ ఆ ముహూర్తం అంత బాగాలేదని అనుకని 22 న వచ్చేయాలని ఫిక్స్ అయ్యారట. పబ్లిసిటీ విషయంలో కూడా ఇజంకి పూర్తి సపోర్ట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడట. ఇఫ్పుడు చెప్పండి ఇంతకుమించిన అన్నదమ్ముల అనుబంధం ఇంకేం ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news