Specialsపవన్ కళ్యాణ్ రాంగ్ మెసేజ్ ఇచ్చాడా..?! మరి మిగతా హీరోలు ఏమి...

పవన్ కళ్యాణ్ రాంగ్ మెసేజ్ ఇచ్చాడా..?! మరి మిగతా హీరోలు ఏమి చేస్తున్నారు ??

కోలారులో హత్యకు గురైన వినోద్ కుటుంబాన్ని తిరుపతిలో పరామర్శించారు సినీనటుడు పవన్ కళ్యాణ్. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వినోద్ తల్లిని ఓదార్చారు. చాలాసేపు కుటుంబసబ్యులతోనే కలిసి కూర్చున్నారు. వినోద్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

రెండు నెలల్లో అమెరికా వెల్లాల్సిన వినోద్.. ఇలా చనిపోవడం బాధగా ఉందన్నారు పవన్. ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే వినోద్ హత్యగావించబడడం తట్టుకోలేకపోతున్నానన్నారు. వినోద్ మృతికి కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఫెయిలయితే కర్నాటక గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు.

పోటీతత్వం ఉంటే మంచిదే కానీ.. అది హద్దు దాటకూడదన్నారు. అభిమానం ఉండాలి కానీ అది చంపుకునేంత ఉండకూడదన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

హత్యకు గురైన తన అభిమాని ఇంటికెళ్లి.. తన అభిమానులకు పవన్ ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నాడు. చనిపోయిన కుటుంబానికి అండగా ఉండాల్సిందే.. దాన్ని ఎవరూ కాదనరు. కాని ఇలాంటి ఘటనలతో విద్వేషాలు ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు.

హీరోలకు అభిమానులు, సంఘాలు ఉండటం సహజమే. గతంలోనూ అభిమాన సంఘాలు కొట్టుకునేవి.. తిట్టుకునేవి.. కానీ ఇప్పుడు అది హద్దులు దాటి హత్యల వరకు వెళ్లింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మెగా ఆడియో ఫంక్షన్లలో పవన్ కళ్యాన్ అభిమానుల గోల మనకు తెలిసిందే. ప్రతి ఫంక్షన్ లో పవన్ అభిమానులు గందరగోళం చేసేవాళ్లు. సౌమ్యంగా కనబడే నాగబాబు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి తన అభిమానులను ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించని పవన్ ను ఎలా అర్థం చేసుకోవాలి.

ఈ మధ్య అభిమానానికి కులం కూడా తోడవ్వడం.. ప్రమాదకర ధోరణులను పెంచుతోంది. ఫ్యాన్స్ కూడా కులాల వారీగా అభిమానులుగా చీలిపోయారు. అసలు ఇంతలా అభిమానించే స్థాయికి తీసుకురావడమే ప్రమాదకరం. అభిమానం పేరుతో ఊగిపోతున్న అభిమానులకు దిశానిర్ధేశం చేయకుండా.. పరిస్థితులు కత్తులతో చంపుకునే అంతగా మారే అవకాశం ఇవ్వడం ఎంత వరకు న్యాయం ?

పవన్ కళ్యాణ్ అనే కాదు ఇప్పుడు అవతల ఫ్యాన్ అభిమానించే హీరో ఎందుకని ఇంతవరకు ఈ ఘటనని ఖండించలేదు ? అలాగే మిగతా హీరోలు బయటకు వచ్చి మేమంతా ఒక్కటే అనే సందేశాన్ని ఒక ప్రెస్ మీట్ ద్వారా ఎందుకు ఇవ్వలేదు ?

చివరగా అభిమానులకు ఓమాట. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, స్నేహితులను, మీ దగ్గరవాల్లను అభిమానించండి. మీ హీరోలను అభిమానించండి. కానీ హద్దులు దాటొద్దు. ఫ్యాన్స్ ను చూస్తే గర్వపడేలా ఉండాలి.. చీదరించుకునేలా ఉండొద్దు..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news