Newsఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లకు ఒక అభిమాని బహిరంగ లేఖ!!

ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లకు ఒక అభిమాని బహిరంగ లేఖ!!

కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఘటన లో వినోద్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకి గురి అయిన విషయం తెలిసిందే. దీనికి ఎన్టీఆర్ అభిమానే కారణమంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్.. పవన్ కళ్యాణ్ లకు ఓ సగటు అభిమాని రాసినట్లుగా చెప్పుకుంటున్న లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆలేఖ యధాతథంగా మీకోసం..

ప్రియమైన పవన్ కళ్యాణ్, Jr.NTR లకు , ఓ సాధారణ అభిమాని నమస్కరించి రాయునది.
తిరుపతిలో జరగబోయే జనసేన సభా ఏర్పాట్లలో పవన్ గారు, జనతాగ్యారేజ్ ప్రమోషన్ కార్యక్రమంలో Jr.NTR గారు….మీమీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారని నాకు తెలుసు, అయినా ఈ సంధర్భంగా మీకో మాట గుర్తు చేయాలనుకుంటున్న….. ఆవేశమో? ఆలోచనారాహిత్యమో? తలకెక్కిన అభిమానమో? కారణం ఏదైనా వినోద్ ఈ రోజు మన మధ్య లేకుండా పోయాడు.

మీ గురించి పోట్లాడుకొని..ఓ నిండు ప్రాణం బలైందని తెలిసిన వెంటనే…మీరిద్దరు కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు మేమంతా ఒక్కటే అని ఓ పిలుపునిస్తే ఎంత బాగుండేది. ఎందుకు మీరా పని చేయలేకపోయారు? పవన్ , NTR ల ఆత్మీయ ఆలింగనం అంటూ అన్ని ఛానల్స్ మీ వీడియోలు చూపిస్తుంటే…అరేయ్ నువ్వు , నేనే కాదు, మా స్టార్ , మీ స్టార్ కూడా ఫ్రెండ్స్ యేరా అంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసేవారు కదా మీమీ అభిమానులు.!

హిట్లు, ప్లాఫ్ లు సినిమా ఇండస్ట్రీలో కామనే…కానీ అభిమానం అనేది ఎప్పటికీ కొలమానం …అలాంటి అభిమాని తన ప్రాణాలు కోల్పోయాడని తెలిసినప్పుడు…మేమంతా ఒక్కటే అని ఇద్దరూ కలిసి కూర్చొని ఓ మెసేజ్ ను అభిమానుల్లోకి పంపితే ఎంత బాగుండు.!
మీమీ ఫ్యాన్స్ బద్ద శత్రువులు కాకముందే, ఇండియా, పాక్ లా విడిపోక ముందే….మీరిద్దరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ! ఇది తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు, టివీలు అదేపనిగా మోగేటట్టు , సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటట్టు… ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదంటూ…. ఏదైనా చేయండి సార్.

చివరిగా ఒక్కటి గుర్తుంచుకోండి….. మీరు పవర్ స్టార్ కావడం వెనకున్నది మేమే, మిమ్మల్ని యంగ్ టైగర్ అంటూ అభిమానించేది మేమే….సినీ ప్రపంచంలో ఉన్న ఏ స్టార్ వెనకైనా స్వార్థం ఎరుగని నిస్వార్థ సైనికులం మేమే. అంతగా మిమ్మల్ని అభిమానించే మావాళ్లు కొట్టుకు చస్తున్నారు సార్.! కుల,మత, జాతి , ప్రాంత వైరుధ్యాలే చావుకు కారణం అనుకుంటున్న ఈ రోజుల్లో…..సినిమా స్టార్లపై హద్దులు దాటిన అభిమానానికి నిర్జీవంగా పడివున్న వినోద్ శవమే ఓ సజీవ సాక్ష్యం.

మరణించిన సాటి అభిమాని ఆత్మ తరఫున, 8 కోట్ల తెలుగు ప్రజల తరఫున మిమ్మల్ని నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇద్దరూ కలిసి ఇప్పటికైనా ఓ ప్రెస్ మీట్ పెట్టండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news