Moviesరజని కాంత్ కబాలి మూవీ రివ్యూ, రేటింగ్ & ఎనాలిసిస్

రజని కాంత్ కబాలి మూవీ రివ్యూ, రేటింగ్ & ఎనాలిసిస్

భారీ ఎక్స్‌పెక్టేషన్స్……ఆఫీసులకు సెలవులు, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌తో వాళ్ళ ఎంప్లాయిస్ కోసం థియేటర్స్‌నే బుక్ చేసి పడేశాయి. చెన్నై స్తంభించిపోయే పరిస్థితి. లింగా, కొచ్చాడియన్ లాంటి భారీ ఫ్లాప్స్ తర్వాత కూడా రజనీ మేనియా మామూలుగా లేదు. మరి సినిమా కూడా ఆ స్థాయిలో ఉందా? మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు. అసలు కథ అదేనా? వేరే ఉందా? ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రివ్యూ మీకోసం

మలేషియా వలస వెళ్ళిన ఫ్యామిలీస్‌లో కబలీశ్వరన్ ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కడి భారతీయులను వాళ్ళు వేధిస్తుంటే కబాలి తిరగబడతాడు. వాళ్ళతో ఫైట్ చేస్తాడు. తనకు తెలియకుండానే డాన్‌ అవుతాడు. ఆ తర్వాత చాలా పెద్ద ట్విస్ట్‌తో కథ కీలక మలుపు తిరుగుతుంది. కబాలి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కబాలి ఎందుకుం జైలుకు వెళ్లాడు? జైలు నుంచి వచ్చాక ఏం చేశాడు? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అన్నది కథ.

ముందుగా చెప్పుకోవాల్సింది రజనీ గురించే…ఈ వయసులో కూడా రజనీ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఆరోగ్యసమస్యలు కూడా రజనీకి ఆఫ్ స్క్రీన్ టైంలోనే ఉండేలా ఉన్నాయి. ఒక్కసారి కెమేరా ముందుకు వస్తే మాత్రం కుర్రాడే. అలాగే రాధికా ఆప్టే కూడా తన రోల్‌కి ఫుల్ జస్టిస్ చేసింది. వేరే ఏ హీరోయిన్ అయినా కూడా ఆ క్యారెక్టర్ ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదు. మిగతా ఆర్టిస్ట్స్ అందరూ కూడా బాగానే చేశారు.

రజనీ తర్వాత చెప్పుకోవాల్సింది డైరెక్టర్ పా.రంజిత్ గురించే. కేవలం రెండు సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న మనవాడు రజనీని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. రజనీ ఇమేజ్‌ని బేలన్స్ చేస్తూనే కథకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా లింగా లాంటి సినిమాల్లో రజనీ ఇమేజ్ పేరు చెప్పి కథను చెడగొడితే మనవాడు మాత్రం కథను బ్రతికించాడు. రజనీకాంత్‌ని ఒప్పించాడు. అందుకే ఇది పూర్తిగా రజనీకాంత్ సినిమా అని చెప్పలేం. రంజిత్ సినిమా కూడా. ఈ విషయంలో మాత్రం రజినీ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక్కసారి కథలో ఇన్వాల్వ్ అయితే మాత్రం అందరూ కబళీశ్వరుని కథను ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్‌ కూడా పూర్తిగా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయి చేశాడు. టెక్నికల్‌గా సినిమా బ్రిలియంట్‌గా ఉంది. ఫొటోగ్రఫీ సూపర్బ్. ఫస్ట్ హాఫ్‌లో చాలా పెద్ద కథ ఉన్నప్పటికీ అస్సలు బోర్ కొట్టకుండా చేయడంలో ఎడిటర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఫ్యామిలీ సీన్స్ కూడా బోర్ కొట్టకుండా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే పీక్స్.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమా విషాదాంతం అవుతుంది. అలా అని రజనీ చనిపోతాడని ఊహించుకోకండి. రజినీ కాంత్ చనిపోడు. కానీ ఇది విషాదాంతమే. ఆ విషయం ఇక్కడే చెప్పెయ్యెచ్చు. కానీ మీరు థ్రిల్ మిస్సవ్వకూడదని చెప్పట్లేదు. కథ మాత్రం నాయకుడు సినిమాకు చాలా దగ్గరగా ఉంది. బట్ సీన్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. యువ డైరెక్టర్ రంజిత్ సినిమాకు పూర్తి ఫ్రెష్ కలర్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు.

ఓవరాల్‌గా ఇది రజనీ ప్యాన్స్‌కి మాత్రమే కాదు సినిమా లవర్స్ అందరికీ కూడా పూర్తిగా బాగుందనిపించే మంచి సినిమా. డైరెక్టర్, హీరో ఇద్దరూ సక్సెస్ అయిన సినిమాల లిస్లులోకి కబాలి కూడా చేరుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news