20 కోట్ల సాంగ్ శంకర్ కొంపముంచేశాడు..!

20

రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ సినిమా గురువారం భారీస్థాయిలో రిలీజైంది. రజినితో పాటుగా ప్రతినాయకుడిగా చేసిన అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. విలన్ గా అదరగొట్టిన అక్షయ్ కుమార్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా కొన్నిచోట్ల మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలాఉంటే సినిమా కోసం 20 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్ ను శంకర్ వృధా చేశాడు.
1
2.ఓ సినిమా మొత్తం అయ్యాక కింద టైటిల్స్ పడుతున్న టైంలో యంత్రపు దేశపు సుందరివే అంటూ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఖర్చు అక్షరాల 20 కోట్లు. లీడ్ పెయిర్ మధ్య అదే రోబోల మధ్య వచ్చే ఈ సాంగ్ చాలా ఖర్చు పెట్టి చేశాడు శంకర్. దాన్ని సినిమాలో ఎక్కడో ఓ చోట ఇరికించకుండా సినిమా పూర్తయ్యాక వదిలారు. అయితే అప్పటికే సినిమా అయిపోయిందని సగం మంది సీట్లలోంచి లేచెళ్లిపోగా మిగిలిన వారికి వారు అడ్డుగా మారే పరిస్థితి వచ్చింది.

అలా శంకర్ ఏదైతే కొత్తగా ఆలోచించి ఆ సాంగ్ చివరన పెట్టాడో అది ఉన్నా లేకున్నా పెద్ద ఉపయోగం ఏమి లేదన్నట్టు ఉంది. 2.ఓ టాక్ పర్వాలేదు సినిమా కచ్చితంగా రికార్డులు సృష్టించేలా ఉంది.

Leave a comment