ఇన్నేళ్ల కెరియర్ లో చిరంజీవి మొదటిసారి ఇలా..!

chiranjeevi

150 సినిమాల ప్రస్థానంలో మెగాస్టార్ ఎన్నడు లేని టెస్ట్ షూట్ విధానం రాబోతున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డికి చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ గా అభిమాన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో సైరా నరసింహారెడ్డి మూవీని తలపెట్టారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అని.. కెరియర్ లో తొలిసారి చిరు సినిమాలో రెండు మూడు ఇంపార్టెంట్ సీన్స్ టెస్ట్ షూట్ చేశారట. దానికి సాటిస్ఫై అయ్యాకే రెగ్యులర్ షూట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. పునాదిరాళ్ల నుండి ఖైది నంబర్ 150 వరకు చిరు నటించిన 150 సినిమాల్లో ఇలా టెస్ట్ షూట్ ఏ సినిమాకు చేయలేదట.

మొత్తానికి సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా తీసేందుకు కొణిదెల ప్రొడక్షన్ టీం బాగా వర్క్ అవుట్స్ చేస్తుంది. రాం చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాలో బిగ్ బి అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని తెలిసిందే. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా 2019 పొంగల్ టార్గెట్ తో వస్తుందట.

Leave a comment