Moviesలక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్..రెండు థియేటర్లు క్లోజ్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్..రెండు థియేటర్లు క్లోజ్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా వెరైటీ..ఆయన ఎవరినైనా టార్గెట్ చేసుకొని ట్విట్ చేయగలరు..ఎవరి మీద అయినా సినిమా తీయగలరు..కానీ అవి ఎప్పుడ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేలా చూసుకుంటారు. అదే ఆయన ప్రచారానికి బలం అని భావిస్తుంటారు.

గత కొన్ని రోజులుగా వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మూవీ ఎన్ని కాంట్రవర్సీలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ మొదలు కొని ట్రైలర్ వరకు ఎదో ఒక కాంట్రవర్సీ చేయడంతో సినిమాపై జనాలకు బాగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో సీఎం చంద్రబాబు ని విలన్ గా చూపించారని టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఫిర్యాదుల చేశారు.

మొత్తానికి ఈ సినిమా విషయంలో ఈసీ జోక్యం చేసుకోవడం కోడ్ ఉన్నందు ఏపిలో రిలీజ్ చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే మొన్న మే1 న ఏపిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు..కానీ ఈసీ మరోసారి అభ్యంతరం చెప్పింది.

ఎన్నికల నేపధ్యంలో కౌంటింగ్ ముగిసేవరకు రాజకీయ నేతల బయోపిక్ లు విడుదల చేయకూడదనే ఆదేశాలిచ్చింది ఎన్నికల కమిషన్. కానీ వర్మ తాను తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఏపీలో విడుదల చేస్తానని పట్టుబట్టారు. దీనిపై ఈసీకి లెటర్ కూడా రాశారు. కానీ దానికి ఈసీ అంగీకరించలేదు.

వర్మ మాత్రం థియేటర్లకు క్యూబ్ లు పంపించేశారు. దాంతో థియేటర్ల యాజమాన్యం కూడా సినిమా రిలీజ్ చేయడానికి వెనుకంజ వేశాయి. కానీ కడప పోరుమామిళ్లలోని వైసీపీ నేతలకు చెందిన రెండు థియేటర్లలో షోలను ప్రదర్శించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు వెళ్లడంతో, నియమాలు ఉల్లంఘించి సినిమాను ప్రదర్శించినందుకు థియేటర్ల లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. మొత్తానికి వర్మ దెబ్బకు రెండు థియేటర్లు మూసుకునే పరిస్థికి వచ్చింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news