2.0 వీకెండ్ కలక్షన్స్.. షాక్ లో సినివర్గం..!

29

రజిని, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో రజినితో పాటుగా అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. గురువారం రిలీజైన ఈ సినిమా 4 రోజుల్లో ఇండియా మొత్తం మీద 127. 4 కోట్లు షేర్ రాబట్టింది.
ఆన్ లైన్ లో 2.0 హెచ్.డి ప్రింట్.. తమిళ్ రాకర్స్ కొంపముంచేశారు..!
400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. రోబో సినిమా ఎలాంటి అంచనాలతో రాలేదు అందుకే ఆ సినిమాలో విజువల్స్ తో ఆడియెన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. 2.ఓలో కూడా కళ్లుచెదిరే విఎఫెక్స్ ఎలిమెంట్స్ ఉన్నా కథ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడం మైనస్ అయ్యింది.

సినిమా విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ పరంగా అద్భుతం అనిపిస్తున్నా కలక్షన్స్ మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఏరియాల వారిగా 2.ఓ వరల్డ్ వైడ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
2
నైజాం : 13.70 కోట్లు

సీడెడ్ : 4.90 కోట్లు

ఉత్తరాంధ్ర : 4.28 కోట్లు

ఈస్ట్ : 2.46 కోట్లు

వెస్ట్ : 1.71 కోట్లు

కృష్ణా : 2 కోట్లు

గుంటూరు : 2.59 కోట్లు

నెల్లూరు : 1.36 కోట్లు

ఏపి/తెలంగాణా : 33 కోట్లు

తమిళనాడు : 31.9 కోట్లు

కర్ణాటక : 10.4 కోట్లు

కేరళ : 5.3 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 46.8 కోట్లు

ఆల్ ఇండియా టోటల్ : 127.4 కోట్లు

Leave a comment