Gossipsఅక్కడ 2.0 భారీ డిజాస్టర్..!

అక్కడ 2.0 భారీ డిజాస్టర్..!

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు. ఇక రోబో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న 2.ఓ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్న 2.ఓ టీజర్ రీసెంట్ గా రిలీజైంది.
1
టీజర్ సౌత్ లో ప్రభంజనం సృష్టిస్తుంటే నార్త్ లో మాత్రం టీజర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న అక్షయ్ కుమార్ ను టీజర్ లో ఒక్క ఫ్రేం లోనే ఉంచడం బీ టౌన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. అంతేకాదు త్రీడీ టీజర్ కాబట్టి డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల మీద టీజర్ అంత ప్రభావం చూపించలేదు.
2
అందుకే సౌత్ లో 2.ఓ టీజర్ సూపర్ హిట్ అవగా బాలీవుడ్ లో మాత్రం అంత ప్రభావం చూపించలేదు. కరణ్ జోహార్ 2.ఓ ప్రమోట్ చేయడం లో విఫలమవుతున్నాడని చెప్పొచ్చు. నవంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news