యంగ్ టైగర్ ప్రస్థానం @ 17 ఏళ్ళు …?

ఈతరం నటులలో ఆహార్యం, అభినయంతో డైలాగులు చెప్పడం, మైమరిపించేల డాన్సులు వేయటం ఇలా అన్ని కళలు సమపాళ్ళలో కలిగిన నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఆయన ఏ సినిమా చేసినా దాంట్లో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించడం ఈ యంగ్ టైగర్ కి అలవాటే. అందుకే ఆయన 17 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది.

బాల రామాయణం సినిమాతో కెరియర్ ప్రారంభించిన యుంగ్ టైగర్ 2001 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ‘నిన్నుచుడాలని’ సినిమాతో తోలిసారి హీరోగా చేసాడు, కానీ అదే సంవత్సరం లో వచ్చిన ‘ స్టూడెంట్ నెం .1’ ఘన విజయం సాదించి అతి చిన్న వయసులో యన్.టి.ఆర్ సాదించబోయే సంచలనాలకు తొలి మైలు రాయిగా నిలిచింది. 2002 లో వచ్చిన ‘ఆది’ తో కలక్షన్ల వర్షం కురిపించి మాస్ కు దగ్గరయ్యాడు. 2003 లో వచ్చిన సింహాద్రి లో నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేత దాసోహం అనిపించాడు. ఇలా జూనియర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే విషయాలు ఉన్నాయి. 20 సంవత్సరాలకే స్టార్ హీరో గా ఎదిగిపోయిన యన్.టి.ఆర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోగా తెలుగు తెరమీద సంచలనాలు రేపుతున్నాడు.

తారక్ వెండి తెరమీద కి వచ్చి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయనకి సతి హీరోలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఆయన అభిమానులు మరో అడుగు ముందుకేసి 17 సంవత్సరాల టాలివుడ్ యాత్రను ఈ రోజుసెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికోసం #17MajesticYearsOfNTR ట్విట్టర్ హ్యాండిల్ తయారు చేశారు. ఈ 17 సంవత్సరాలలోతెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేసిన @tarak9999 ను అభినందిస్తున్నారు. అభిమానుల తాకిడికి తారక్ ట్విట్టర్ అకౌంట్ హోరెత్తిపోతోంది.

Leave a comment