కళ్యాణ్ రామ్ ” 118 ” థియేట్రికల్ ట్రైలర్..!

37

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రాం సరసన నివేథా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు. షాలిని ప్రేమలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న హీరోకి కలగా ఓ అమ్మాయి వేదన వినపడుతుంది. ఆమెను కనిపెట్టే క్రమంలో మన హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ.

ఈసారి కళ్యాణ్ రాం పర్ఫెక్ట్ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడని తెలుస్తుంది. నివేథా థామస్, షాలిని పాండేలు సినిమాకు ప్లస్ అవనున్నారు. సినిమాటోగ్రాఫర్ గుహన్ తొలి ప్రయత్నంగా చేస్తున్న 118 కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకునేలా ఉంది. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తి కలిగించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment