నందమూరి కళ్యాణ్ రామ్ – ” 118 టీజర్ “

68

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని చేస్తున్న సినిమా 118. థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

కళ్యాణ్ రాం సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓపెన్ చేస్తే కళ్యాణ్ రాం, షాలిని లవ్ కపుల్స్ గా కనిపిస్తున్నారు. అయితే కళ్యాణ్ రాం ను ఓ గతం వెంటాడుతుంది. వాటిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఏం జరిగింది అన్నది సినిమా కథ. 118 డిఫరెంట్ ప్రయత్నంగా అనిపిస్తుండగా సినిమా తప్పకుండా కళ్యాణ్ రాం కు మంచి ఫలితాన్ని అందించేలా ఉంది.

పటాస్ తర్వాత హిట్ కోసం తపిస్తున్న కళ్యాణ్ రాం ఈ 118తో కచ్చితంగా హిట్ కొడతాడని ఈ టీజర్ చూసి చెప్పేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment