Gossipsస్వాతి బోల్డ్ ఇంటర్వూ : మరీ ఇంత 'హాట్' అవసరమా ...?

స్వాతి బోల్డ్ ఇంటర్వూ : మరీ ఇంత ‘హాట్’ అవసరమా …?

బుల్లితెర మీద కలర్స్ అనే పోగ్రామ్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించి… తెలుగు, తమిళ సినీ ఇండ్రస్ట్రీలో హీరోయిన్ గా మారిపోయిన కలర్స్ స్వాతి. ఆ తరువాత ఓ ఫైలెట్ ను పెళ్లి చేసుకుని ఇండోనేషియాకు మకాం మార్చేసింది. అయితే తెలుగు పిల్ల ..అందులోనూ..పెళ్లయిపోయింది ఈ యాంగ్ హీరోయిన్ ఇక పద్దతిగా ఉంటుంది అని అంతా అనుకుంటుంటూనే… ఏకంగా ఎప్పుడూ లేనంత స్థాయిలో ఆమె రెచ్చిపోతోంది.

స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని మరీ హాట్ హాట్ ఇంటర్వ్యూ లు ఇస్తూ… అంతే హాట్ హాట్ గా కొత్త కొత్త సంగతులు చెప్పుకొచ్చింది. ఓ తెలుగు మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే నిజంగా స్వాతి ఇంత బరితెగించిందా అని అనిపిస్తోంది. ఆ ఇంటర్వూ మొత్తం స్విమ్ సూట్లో సాగడం ప్రేక్షకులకు మరింత హీటెక్కించింది.

ఆ ఇంటర్వ్యూ లో ఆమె కొత్త కొత్త సంగతులు బయటపెట్టింది. తనకి టాటులంటే ఎంతో ఇష్టమని చెప్పిన స్వాతి.. వాటిని తన భర్తకు మాత్రమే కనిపించి మిగతా వారికి కనిపించని ప్లేస్ లో అవి వేయించుకుంటానని చెప్పింది. అది తన భర్తకు స్పెషల్ గా గుర్తుండేలా వేయించుకుంటున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్లకు ఇది పెద్ద విషయం కాకపోయినా… తెలుగింటి అమ్మాయి స్వాతి ఇలా చేయటం మాత్రం అందరికి షాక్ కలిగిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news