Gossipsసీనియర్ హీరోయిన్ వలలో మునిగిన బెల్లంకొండ బాబు..

సీనియర్ హీరోయిన్ వలలో మునిగిన బెల్లంకొండ బాబు..

ర్మాత, డిస్ట్రిబ్యూటర్ బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా అల్లుడు శీనుతో తెరంగేట్రం చేశాడు. కుర్ర హీరో అయినా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీనివాస్ కు ఇంతవరకు కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. నిన్న (శుక్రవారం) రిలీజైన కవచం సినిమా కూడా సోసోగానే ఉందని అంటున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. ఇదే కాదు బెల్లంకొండ శ్రీనివాస్ తేజ కాంబినేషన్ లో వస్తున్న సీత సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఒక సినిమాలో నటిస్తేనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉండగా బెల్లంకొండ బాబుతో కాజల్ వరుసగా రెండు సినిమాలు నటిస్తుండటం ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కు దారితీసింది.
2
కవచం ప్రమోషన్స్ లో కూడా కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. చూస్తుంటే శ్రీనివాస్, కాజల్ మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని కొందరు అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇద్దరు సరదా సరదాగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తుంది. సీనియర్ స్టార్ హీరోయిన్ గా కాజల్ అందరి స్టార్స్ తో నటించింది. అయితే బెల్లంకొండ బాబుతో కనెక్ట్ అవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈమధ్య కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే లోపే వరుస అవకాశాలతో కాజల్ సూపర్ ఫాం లో ఉంది.
1
మరి కాజల్, శ్రీనివాస్ పై వస్తున్న ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ వార్తలు వారిదాకా చేరితే ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో చూడాలి. నిన్న రిలీజైన కవచం సినిమా కూడా బెల్లంకొండ బాబుని నిరాశపరచిందని అంటున్నారు. శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీ పవర్ ఫుల్ పోలీస్ కథగా వచ్చింది. సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా మాస్ ఆడియెన్స్ మెప్పించేలా ఈ మూవీ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news