Gossipsవిశాల్ ని చంపుతానంటున్న మాజీ ప్రియురాలు..

విశాల్ ని చంపుతానంటున్న మాజీ ప్రియురాలు..

కోలీవుడ్ ప్రేమ జంటగా ఉన్న విశాల్, వరలక్ష్మిలు ఇప్పుడు ఒకరికి ఒకరు శత్రువులుగా మారారా అంటే అవుననే అంటున్నారు. నిన్నటిదాకా ప్రేమా పక్షులుగా ఉన్న వీరిద్దరు సడెన్ గా ఎవరి దారి వారిది అన్నట్టు ప్రవరిస్తున్నారు. విశాల్ చాలా సార్లు తన ప్రేమ విషయాన్ని చెప్పి చెప్పనట్టుగా చెప్పాడు. అయితే వరలక్ష్మి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని భావించాడో ఏమో అతను కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఛాన్స్ వస్తే విశాల్ ను చంపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మి.
2
ప్రేమించిన వాడిని చంపాలనుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఈమధ్య కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న వరలక్ష్మి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ పాత్రలకు కాదు తనకంటూ స్పెషల్ పాత్రలను రాసేలా వరలక్ష్మి నటన ఉంది. పందెం కోడి-2, సర్కార్ సినిమాల్లో యాంట్రీ రోల్స్ వేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా ముద్దు ఎవరికి పెడతావ్ అంటే శిబు పేరు చెప్పింది. ఇక ఎవరిని చంపాలని అనుకుంటున్నావ్ అంటే విశాల్ పేరు చెప్పింది.
1
విశాల్ తో కటీఫ్ అయినా అతని మీద ఇంకా ప్రేమ చావలేదు అనుకుంటా అందుకే విశాల్ ను చంపేస్తా అంటూ సరదాగా చెప్పింది వరలక్ష్మి. ఆమె చెప్పిన ఆన్సర్ బట్టే తెలుస్తుంది. ఆమె విశాల్ ను ఇంకా ప్రేమిస్తూనే ఉందని. నడిఘర్ సంఘం ఎలక్షన్స్ టైంలో విశాల్ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ తో గొడవ పడ్డాడు. ఆయన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించేందుకే కొత్త టీం ఏర్పరచి కమిటీని ఏర్పరిచాడు విశాల్. ఆ దెబ్బతో విశాల్ వరలక్ష్మిల ప్రేమకు ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. మరి విశాల్ ఓకే అన్నా శరత్ కుమార్ మాత్రం వీరి ప్రేమను యాక్సెప్ట్ చేసేలా లేడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news