Gossipsవిజయ్ దేవరకొండతో అనసూయ.. ఏంటి మ్యాటర్..!

విజయ్ దేవరకొండతో అనసూయ.. ఏంటి మ్యాటర్..!

విజయ్ దేవరకొండ హీరోగా సూపర్ ఫాం లో ఉన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ఇక మధ్యలో నోటా వచ్చి ఫ్లాప్ అయిన మళ్లీ టాక్సీవాలాతో హిట్ కొట్టాడు విజయ్. ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండతో బుల్లితెర యాంకర్ అనసూయ క్లోజ్ గా మూవ్ అవుతుందట. యాంకర్ గా తన అంద చందాలతో అదరగొడుతున్న అనసూయ ఈమధ్య సినిమాల్లో కూడా రాణిస్తుంది.

రాం చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో కీలక పాత్ర పోశించిన అనసూయ మరిన్ని సినిమా అవకాశాలను అందుకూంది. ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్న సినిమాలో అనసూయ ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తుందట. ఈ సినిమాలో దాదాపుగా హీరోయిన్ తో సమానమైన రోల్ కోస అనసూయ తెగ ప్రయత్నాలు చేస్తుందట.

విజయ్ నిర్మాత కాబట్టి అతనితో రోజు టచ్ లో ఉంటుందట. తప్పకుండా తనకే ఆ ఛాన్స్ ఇవ్వాలని చెబుతుందట. అనసూయ టాలెంట్ తో పాటుగా ఆమెను సినిమాలో తీసుకుంటే సినిమాకు అది ప్లస్ అవుతుందని భావించి విజయ్ ఆమెను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తూనే వెండితెర మీద సత్తా చాటాలని చూస్తున్న అనసూయకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news