Gossipsరిలీజ్ అవ్వకుండానే 180 కోట్లు లాభం.. ఇది శంకర్ సత్తా..

రిలీజ్ అవ్వకుండానే 180 కోట్లు లాభం.. ఇది శంకర్ సత్తా..

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాగా 2.ఓ భరీ అంచనాలు ఏర్పరచుకుంది. రోబో సీక్వల్ లో వస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ గురువారం రిలీజ్ అవుతుంది. 6800 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా డిజిటైల్, శాటిలైట్ రైట్స్ దుమ్ముదులిపేస్తుంది.
1
రజినితో పాటుగా ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మరో కారణం అక్షయ్ కుమార్ అని తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ 2.ఓలో విలన్ గా చేయడం సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది.
2
సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు కొనేశారట. ఇది అన్ని భాషలకు కలిపి అని తెలుస్తుంది. ఇక డిజిటల్ రైట్స్ కూడా 60 కోట్లు దాకా పలికాయని తెలుస్తుంది. అంటే కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే 180 కోట్లు రాబట్టింది 2.ఓ. ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటే బాహుబలి రికార్డులను సైతం తిరగరాస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news