Gossipsరకుల్ కి చుక్కలు చూపిస్తున్న తారక్,చరణ్ ఫ్యాన్స్..

రకుల్ కి చుక్కలు చూపిస్తున్న తారక్,చరణ్ ఫ్యాన్స్..

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛాన్స్ కోసం రకుల్ ఆ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేసింది. ఇండియన్ సినిమా గర్వపడే దర్శకుడు రాజమౌళి.. రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటనతో పాటుగా డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తారని అన్నది అయితే ఆ ట్వీట్ పై ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఫ్యాన్స్ నెగటివ్ గా స్పందిస్తున్నారు.

సినిమాలో ఛాన్స్ కోసమే రకుల్ ఆ ట్వీట్ చేసిందని భావిస్తూ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తారక్ ను వదిలేయమని చెప్పగా.. చరణ్ ఫ్యాన్స్ నీ బిస్కెట్లు సినిమా ఛాన్స్ కోసమే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్పైడర్ కు ముందు దాకా ఫుల్ క్రేజ్ మీద ఉన్న రకుల్ ఆ సినిమా తర్వాత తెలుగులో స్టార్ ఛాన్స్ దక్కించుకోలేదు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో శ్రీదేవిగా నటిస్తున్న రకుల్ తమిళంలో కార్తి దేవ్ సినిమాలో నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news