Moviesమ‌రో వివాదంలో ఇస్మార్ట్ శంక‌ర్‌... పూరి ఇంత అన్యాయ‌మా...

మ‌రో వివాదంలో ఇస్మార్ట్ శంక‌ర్‌… పూరి ఇంత అన్యాయ‌మా…

రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. రిలీజ్ కు ముందు ఏ సర్టిఫికెట్ తో ఎన్నో సంచలనాలకు కారణమైన ఈ సినిమాపై ఇప్పుడు కాపీ క్యాట్ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా రెండు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారన్న‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో జై ఆకాష్ తీవ్ర ఆరోపణలు చేయడం తెలుగు సినిమా రంగంలో తీవ్రమైన సంచ‌ల‌నాలు రేకెత్తిస్తోంది.

ఒకరి ఆలోచనలను మరొకరి మెదడులోకి ఎక్కిస్తే ఎలాంటి ? పరిణామాలు తలెత్తుతాయి అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పటికే తమిళంలో ఓ సినిమా రిలీజై హిట్ అయిందని… ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి అదే కథతో తెరకెక్కించడం షాక్‌కు గురి చేసిందని ఆకాష్ ఆరోపించాడు. త‌న క‌థ‌లో లండ‌న్ బ్యాక్‌డ్రాఫ్‌లో ఇద్ద‌రు హీరోలు ఒకేలా ప్ర‌వ‌ర్తిస్తే తాజా సినిమాలో తెలంగాణ‌, ఆంధ్రా నేప‌థ్యం ఎంచుకున్నార‌ని జై ఆకాష్ చెప్పాడు.

ఇస్మార్ట్ శంకర్ రెండు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీశారని.. ఈ రెండు సినిమాల కంటే ముందే తమిళంలో తాను నాన్ యార్ పేరుతో తీసిన సినిమా సూపర్ హిట్ కావడంతో… ఆ సినిమాను తెలుగులో కొత్తగా ఉన్నాడు పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న టైం లోనే పూరి శంకర్ వచ్చిందని… ఈ విషయమై పూరిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఆయన ఫోన్ స్విచాఫ్ వచ్చిందని చెప్పాడు. ఈ వ్యవహారంపై తమిళ నిర్మాతలు సంఘాన్ని ఆశ్రయించానని… తన వాదన నిజం అని చెప్పేందుకు ఆధారాలు సైతం తెలుగు మీడియాకు చూపించాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే లీగల్ గా ముందుకు వెళ్లాల్సి వస్తుందని కూడా హెచ్చ‌రించాడు.

పూరి స్పందించకపోవడంతో తాను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ ను సంప్రదించాన‌ని .. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళ నిర్మాత‌ల మండ‌లితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని కూడా చెప్పాడు. తన సినిమాకు జరిగిన సరిదిద్దేందుకు తనకు ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నట్టు కూడా ఆకాష్ చెప్పాడు. ఏదేమైనా ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news