Gossips‘మోక్షజ్ఞ’సినీ ఎంట్రీ పై బాలయ్య సీరియస్..?

‘మోక్షజ్ఞ’సినీ ఎంట్రీ పై బాలయ్య సీరియస్..?

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు..ఇస్తున్నారు. మెగా, అక్కినేని, మంచు, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వచ్చారు. అయితే మహానటులు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. దివంతగ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తాతా, బాబాయి స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా వస్తున్నారని గత మూడు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ మోక్షజ్ఞ ఎలా ఎంట్రీ ఇవ్వనున్నాడో..ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే నందమూరి ఫ్యామిలీ అంటే మాస్ హీరోలుగా మంచి గుర్తింపు ఉంది. మరి మోక్షజ్ఞ మాస్ హీరోగా వస్తాడా..లవర్ బాయ్ గా వస్తాడా లేదా యక్షన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఆ మద్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో అరంగట్రం చేస్తారని భావించారు..కానీ అది జరగలేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ రూపొందుతుంది.

ఈ సినిమాలో మోక్షజ్ఞ ని ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేయాలని క్రిష్ గట్టి పట్టుదల మీద ఉన్నాడని టాక్. కాకపోతే మోక్షజ్ఞకి సరిపోయే పాత్ర కుదరడం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడికిగా యువ బాలకృష్ణ పాత్రలో మోక్షజ్ఞని చూపించాలని మొదట అనుకున్నారు. కానీ పర్సనాలిటీ..సరిగా సరిపోలేదని టాక్. దాంతో ఈ పాత్ర కూడా బాలయ్యే చేశారు. మరోవైపు బాలకృష్ణ కూడా తన తనయుడు కోసం ఏదో హడావుడిగా సినిమాలు తీయోద్దని సరైన కథతో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఇంట్రడ్యూసింగ్ ఉండాలని..అందుకోసం ఎంత సమయమైనా పరవాలేదు అన్నట్లు టాక్.

అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ కి ‘మనం’సినిమాతో మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది..ఇలాంటి ఇంట్రడ్యూస్ అయితే బాలయ్యకు ఓకే అనేలా ఉన్నారు. ఇప్పుడు క్రిష్ కి కూడా అలాంటి స్పార్క్ వున్న పాత్ర ఏదైనా తట్టకపోతే మాత్రం మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపించే అవకాశం లేనట్లేనని అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news