Gossipsముదురు హీరోయిన్ తో ప్రేమలోపడ్డ ప్రభాస్..?

ముదురు హీరోయిన్ తో ప్రేమలోపడ్డ ప్రభాస్..?

బాహుబలి హీరో ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లలో బిజీ బిజీగా ఉన్నాడు. ఒకపక్కన సాహో సినిమాతో బిజీగా ఉంటూనే మరో సినిమాలో బిజీ అయ్యాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా… పూజ హెగ్డే నటిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా 1960 నాటి ప్రేమకథగా రూపొందుతుందని, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట.

ఈ సినిమాలో హీరోయిన్ పూజా పేద అమ్మాయి గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో రిచ్ అమ్మాయిగా కనిపించిన పూజా , ఇప్పుడు చాలా పేద అమ్మాయిగా కన్పిస్తుందట ఈ పేదింటి అమ్మాయి ప్రేమలో అంతటి శ్రీమంతుడు పడతాడు? అందుకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఈ చిత్రం టైటిల్ విషయంలో ఇప్పటికే కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగతుంది గనుక ‘అమూర్’ అనే టైటిల్ ను పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. ఫ్రెంచ్ భాషలో ‘అమూర్’ అంటే ‘ప్రేమ’ అని అర్థం అట… తాజాగా ‘జాన్’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ‘జాన్’ అనే పేరు అందరికీ పరిచయమైనదే కావడం వలన ఈ టైటిల్ నే ఖరారు చేద్దామనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news