Gossipsమహిళా జర్నలిస్ట్ ని బలవంతపెట్టిన తెలుగు స్టార్ హీరో..?

మహిళా జర్నలిస్ట్ ని బలవంతపెట్టిన తెలుగు స్టార్ హీరో..?

ఇప్పుడు దేశవ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద హాట్ టాఫిక్ గా మారింది. ఈ వ్యవహారంపై మొదటిగా నటి శ్రీ రెడ్డి ఆజ్యం పోయగా అది ఇప్పటికీ భగ భగ మండుతూనే ఉంది. సరే రెడ్డి వ్యవహారం చల్లబడింది అనుకునే సమయానికి బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్, సింగర్ చిన్మయి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా తెలుగు మీడియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ కూడా ఈ వ్యవహారంలో ఓ టాలీవుడ్ హీరో పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ రచ్చ అవుతోంది.

కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండ్రస్ట్రీలోనే లేదని… అన్ని రంగాల్లో ఇది ఉందని ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని అర్ధం అవుతోంది. తాజాగా తెలుగు మీడియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ ఈ వ్యవహారంలో బయటకొచ్చారు. గతంలో తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు.
పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పనిచేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది ఓ మహిళా జర్నలిస్ట్. ఓ నైట్ పార్టీలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత తనను అనేకసార్లు గెస్ట్ హౌజ్ కు పిలిచాడని చెప్పుకొచ్చింది.

నేను గెస్ట్ హౌస్ కి వెళ్లేందుకు నిరాకరించానని .. అయినా ఆ తరువాత నుంచి వేధిస్తూనే ఉన్నాడని ఇలా తన పెళ్లికి రెండు రోజుల ముందు వరకు ఆ ‘కల్ట్ హీరో’ తనకు ఫోన్ చేసేవాడని, ఒక్కసారి కలవాలి రమ్మని పిలిచేవాడని చెప్పుకొచ్చింది. దేంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం రేగింది. ఎవరు ఆ హీరో అంటూ ఆరా తీయడం కనిపించింది. అంతే కాదు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొంతమంది మెగాహీరోలతో పాటు నందమూరి హీరోల పేర్లు కూడా ప్రస్తావిస్తూ రచ్చ రచ్చ చేశారు. అంతే కాదు ఆ హీరో కు సంబందించిన కొంతమంది అభిమానులు బెదిరింపు ధోరణిలో అసభ్యంగా కామెంట్స్ పెట్టడంతో ఆ పోస్టింగ్ ను ఆ మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియా నుంచి తొలిగించేసింది. ఈ వ్యవహారం ఇంకా ఎక్కడివరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news