Gossipsబోయపాటి కి ఆమెపై ఎందుకంత మోజు..?

బోయపాటి కి ఆమెపై ఎందుకంత మోజు..?

టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను ఒక హీరోయిన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇంతకీ బోయపాటి శ్రీను ఎవరి మాయలో పడ్డాడు అంటే ఇంకెవరు కేథరిన్ త్రెసా అని తెలుస్తుంది. బోయపాటి డైరక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో ఆమెని ఎం.ఎల్.ఏగా చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమా తర్వాత కూడా జయ జానకి నాయకా సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో కేథరిన్ ను వాడేశాడు బోయపాటి.
2
ఇక ప్రస్తుతం చేస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ వినయ విధేయ రామ కోసం కూడా కేథరిన్ త్రెసాతో ఓ హాట్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. స్టార్ డైరక్టర్ గా బోయపాటి శ్రీను ఇన్ని ఛాన్సులు ఇచ్చినా సరే కేథరిన్ మాత్రం క్రేజ్ దక్కించుకోలేకపోయింది. బోయపాటి శ్రీను హ్యాండ్ పడ్డాక కూడా అమ్మడి కెరియర్ జోష్ అందుకోలేదు. అయితే అమ్మడికి అవకాశాలు వస్తున్నా తన యాటిట్యూడ్ వల్ల ఛాన్సులు మిస్ అవుతుందట.
1
పూరి ఇద్దరమ్మాయిలతో సినిమా ద్వారా లైం లైట్ లోకి వచ్చిన కేథరిన్ త్రెసా అందం, అభినయం రెండు ఉన్నా సరే టాలీవుడ్ లో అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. మరి చరణ్ తో ఐటం సాంగ్ అయినా సరే కేథరిన్ కు క్రేజ్ తెస్తుందేమొ చూడాలి. ముందు ఈ సాంగ్ కు రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకోగా ఆమె సారీ చెప్పేసింది. అందుకే కేథరిన్ తో ఈ సాంగ్ ప్లాన్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ అదిరిపోతుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news