Gossipsబిగ్ బాస్ లో పవన్ మాజీ భార్య ..?

బిగ్ బాస్ లో పవన్ మాజీ భార్య ..?

తెలుగులో మొట్టమొదటి రియాల్టీ షోగా పేరు పొందిన బిగ్‌బాస్ షోలను ప్రేక్షకులు బాగా ఆదరింహరు. మొదటి సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ గా ఉండడం ఈ షో బాగా హిట్ అవ్వడానికి కారణం అయ్యింది. రెండో సీజన్ కూడా అనేక కాంట్రావర్సీలతో ఫర్వాలేదు అనిపించింది. ఇక మూడో సీజన్‌ ను కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లేందుకు బాగా కష్టపడుతున్నారు బిగ్‌బాస్ నిర్వహకులు. మూడో సీజన్ లో బిగ్ బాస్ గా విక్టరీ వెంకటేష్ ను తీసుకుని ఫ్యామిలి ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మూడో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బయటికి వచ్చాయి. ఇందులో బాగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్‌. నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్యే రేణు దేశాయ్. ఈ సీజన్‌లో ఆమెను తీసుకురావడం వల్ల షోకి రేటింగ్స్ తీసుకురావచ్చని భావిస్తోంది బిగ్‌బాస్ యాజమాన్యం. గత సీజన్‌లో గుర్తింపు లేని ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చారనే కామెట్స్ వినిపించాయి. మూడో సీజన్‌లో ఇటువంటి కామెంట్స్ వినిపించకూడదనే ఉద్దేశంతో ఉంది బిగ్‌బాస్‌.మూడో సీజన్‌లో పేరున్నా ఆర్టిస్ట్‌లను తీసుకునే ఆలోచనలో ఉందట బిగ్‌బాస్ యాజమాన్యం.

ఆమెతో పాటు యాంకర్ ఉదయ భాను,శోభిత ధూళిపాల,గద్దె సింధుర, యూట్యూబ్ స్టార్ జాహ్నవి,వరుణ్ సందేశ్‌, జాకీ, కమల్ కమరాజు,హేమచంద్ర, రఘు మాస్టర్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో ఎవరు ముందు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం ముందుగానే తెలిసిపోవడంతో, ఈ సారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news